Kshama Sawant: ఇండో అమెరికన్ నేత క్షమా సావంత్‌కు ఎమర్జెన్సీ వీసా తిరస్కరించిన భారత్!
- ఇండో అమెరికన్ నేత క్షమా సావంత్‌కు ఎమర్జెన్సీ వీసా తిరస్కరించిన భారత్!
- కాన్సులేట్ ప్రాంగణంలో మద్దతు దారుల ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలోని సియాటెల్‌లో ఉన్న భారత కాన్సులేట్‌లో భారతీయ-అమెరికన్ రాజకీయ నాయకురాలు క్షమా సావంత్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. అత్యవసర వీసా నిరాకరించడంతో సియాటిల్‌లోని భారత కాన్సులేట్ శాంతిభద్రతల సమస్యను ఎదుర్కొంది. కొంతమంది వ్యక్తులు కార్యాలయ సమయం తర్వాత అనుమతి లేకుండా కాన్సులేట్ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించి, బయటకు వెళ్లడానికి నిరాకరించడంతో సంబంధిత స్థానిక అధికారులను పిలవవలసి వచ్చిందని సియాటిల్ లోని భారత కాన్సులేట్ జనరల్ తెలిపింది.

Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
‘‘ఈరోజు కొంతమంది వ్యక్తులు కార్యాలయ సమయం తర్వాత కాన్సులేట్ ప్రాంగణంలోకి అనధికారికంగా ప్రవేశించడం వల్ల తలెత్తిన శాంతిభద్రతల పరిస్థితిని కాన్సులేట్ ఎదుర్కోవలసి వచ్చింది. పదే పదే అభ్యర్థించినప్పటికీ ఈ వ్యక్తులు కాన్సులేట్ ప్రాంగణాన్ని వదిలి వెళ్ళడానికి నిరాకరించారు. కాన్సులేట్ సిబ్బందితో దూకుడుగా మరియు బెదిరింపులకు పాల్పడ్డారు.’’ అని సియాటిల్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో పేర్కొంది.
క్షమా సావంత్.. సియాటిల్ నగర కౌన్సిల్ మాజీ సభ్యురాలు. ఇదే వ్యవహారంపై ఆమె సోషల్ మీడియాలో స్పందించారు. తిరస్కరణ జాబితాలో తన పేరు ఉందని పేర్కొంటూ వీసా నిరాకరించారన్నారు. ఈ క్రమంలోనే మూడుసార్లు తన వీసా నిరాకరించినందుకు గల కారణాలు తెలపాలంటూ తన మద్దతుదారులతో కలిసి భారత కాన్సులేట్ ముందు శాంతియుతంగా నిరసన చేపట్టామన్నారు. క్షమా సావంత్‌కు భారత్ వీసా నిరాకరించడం ఇదే తొలిసారి కాదు. బెంగళూరులో ఉంటున్న ఆమె తల్లి దగ్గరకు వెళ్లేందుకు సావంత్ గతంలో ప్రయత్నించినప్పటికీ వీసా మంజూరు కాలేదు. ఆమె భర్త కాల్విన్ ప్రీస్ట్‌కు మాత్రం వీసా లభించడం విశేషం.
Today, the Consulate was forced to deal with a law and order situation arising from the unauthorized entry by certain individuals into the Consulate premises after office hours.
Despite repeated requests, these individuals refused to leave the Consulate premises and engaged in…
— India In Seattle (@IndiainSeattle) February 7, 2025
A Consular officer said I'm being denied a visa coz I'm on Modi govt's "reject list."
It's clear why.
My socialist City Council office passed a resolution condemning Modi's anti-Muslim anti-poor CAA-NRC citizenship law. We also won a historic ban on caste discrimination.…
— Kshama Sawant (@cmkshama) February 7, 2025
NOW: Kshama Sawant and members of Workers Strike Back are engaging in a peaceful sit-in at the Consulate of India in Seattle, demanding answers for why @cmkshama’s visa has been denied a third time, and why she has been told that the Modi government has placed her on a “reject… pic.twitter.com/a7nZk7HUeL
— Workers Strike Back (@wrkrsstrikeback) February 7, 2025
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు