NTV Telugu Site icon

Clap: సినిమా షూటింగ్ టైంలో క్లాప్ ఎందుకు కొడతారో తెలుసా?

Whatsapp Image 2023 08 20 At 11.42.02 Am

Whatsapp Image 2023 08 20 At 11.42.02 Am

Clap: చిత్రపరిశ్రమ అనేది ఓ రంగుల ప్రపంచం. దానిని ఏలాలని ఎంతో మంది కలలు కంటుంటారు. కొందరు అందులో ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగితే కొందరు పాతాళానికి చేరుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఇందులో నటులు, డైరెక్టర్లు, నిర్మాతలు, టెక్నీషియన్స్ ఇలా ఎంతోమంది డ్రీమ్ ‘సినిమా’. సినిమా షూటింగ్ అంటే చాలా క్లిష్టమైనది.. ఎక్కువ శ్రమతో కూడిన పని.. నటీనటులు కెమెరా ముందు నిలబడగానే కెమెరా స్విచ్చ్ ఆన్ చేయడం అనేది మామూలు విషయం కాదు.. అంతదాకా రావడానికి ఎంతో మంది కృషి చేయాల్సి ఉంటుంది. సినిమా షూటింగ్ అంటే ఒక పద్ధతి ఉంటుంది. కొన్ని నిబంధనలు ఉంటాయి. వాటి పాటించాల్సిందే.. వాటిలో మొదటిది క్లాప్ కొట్టడం ఒకటి. ఏదైనా సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక సన్నివేశం చిత్రీకరించే ముందు కెమెరా ఎదుట లేదా నటీనటుల ముందు క్లాప్ బోర్డ్ ను పెట్టి తీస్తూ ఉంటారు. ఇది మీరు ఎప్పుడైనా గమనించారా. అన్ని షూటింగ్ సమయాలలో క్లాప్ కొట్టడం మనం చూస్తూనే ఉంటాము. సినిమా చిత్రీకరించడంతో దీని ప్రాముఖ్యత చాలా ఎక్కువ. క్లాప్ బోర్డు లేకుండా పూర్తి సినిమా షాట్ ను ఎడిట్ చేయడం చాలా కష్టమట. క్లాప్ బోర్డులో చిత్రీకరించబడిన సన్నివేశం.. తీయడం కెమెరా కోణం ఇలా అన్నీ కూడా ముఖ్యమైన సమాచారం ఉంటుందట.

Read Also:Zepto: అరరే ఎంత పనైపోయింది.. అప్లై చేసింది ఒక ఉద్యోగానికి వచ్చింది డెలివరీ బాయ్ జాబ్

మనం థియేట్లర్లో చూస్తున్న సినిమా క్రమంలోనే షూటింగ్ జరుగదు. చిత్రాన్ని తెరకెక్కించే డైరెక్టర్ తన సౌకర్యం ప్రకారం సినిమా షూటింగ్ చేస్తూ కానిస్తుంటారు. పలు విడివిడి సన్నివేశాలను కథకు అనుగుణంగా సవరిస్తుంటారు. ఈ క్రమంలోని క్లాప్ బోర్డ్ సమాచారం చాలా అవసరమవుతుందట. క్లాప్ బోర్డు పైన సినిమా పేరు, నిర్మాణ సంస్థ, డైరెక్టర్ పేరు, కెమెరా పేరు కూడా రాసి ఉంటుంది. దీంతోపాటు షాట్ ఏ నెలలో ప్రారంభిస్తారో నెల పేరు కూడా రాసి ఉంటుందట. అయితే ఒక్కసారి టేక్ సరిగ్గా జరగకపోతే స్లేట్ పై టేక్ నెంబర్ నంబర్లు రాస్తారు. తర్వాతే నెక్స్ట్ షాట్కు వెళ్లేముందు అంతకు ముందు తీసిన సన్నివేశాలను ఎడిటర్ దగ్గరకు పంపిస్తారు. క్లాప్ బోర్డులోని సీన్ నంబర్ల సాయంతో ఆ వీడియోలను ఒక్కొక్కటిగా సెట్ చేస్తారు ఎడిటర్లు. క్లాప్ బోర్డ్ ఎందుకు కొడతారు అంటే సినిమా షూటింగ్ సమయంలో సౌండ్, విజువల్స్ విడివిడిగా రికార్డు చేయబడతాయి. డైరెక్టర్ లైట్లు, కెమెరా సౌండ్, యాక్షన్ అంటూ ఉంటారు. ఇలాంటి సమయంలో కెమెరా సౌండ్ కలిసి రికార్డ్ చేయడం ప్రారంభమవుతాయి.. ఒకవేళ సరైన సమయానికి కంప్యూటర్లో వాటిని ఒకేసారి సెట్ చేయకపోతే ముందు విజువల్ ఆ తర్వాత సౌండ్ వస్తుంది. దీంతో సీన్ ఆలస్యమవుతుంది. కాబట్టే సన్ని వేశం చిత్రీకరణకు ముందు క్లాప్ బోర్డు కొడతారు.

Read Also:UPI Payments With Out Internet: నెట్ లేకుండానే ఫోన్ పే, గూగుల్ పే చేసేయండిలా