Why Indians Prefer the USA: H-1B వీసాలపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయ టెక్కీల్లో భయాన్ని నింపాయి. H-1B వీసాల రుసుమును $100,000 (రూ. 88 లక్షలు)కి పెంచాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. దీంతో ఆ దేశంలో ఉంటున్న భారతీయులకు భారీ ముల్యంగా దీన్ని భావిస్తున్నారు. అయితే.. ఈ అంశంపై తాజాగా స్పందించిన ట్రంప్.. అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులే తమ దేశానికి రావాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. దేశ భద్రతను దృష్టిలోపెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ చర్యను టెక్ పరిశ్రమ వ్యతిరేకించబోదని చెప్పారు. ఇప్పుడు భారతీయులు అమెరికాను ఇష్టపడటానికి ప్రధాన కారణాలు గురించి తెలుసుకుందాం..
READ MORE: Ranchi: హోటల్ గదిలో ISIS ఉగ్రవాదుల కోసం స్టూడెంట్ బాంబు తయారీ..
futurense నివేదిక ప్రకారం.. భారతీయులు అమెరికాను ఇష్టపడటానికి చాలా కారణాలు ఉన్నాయి. అమెరికాలో లభించే ఆర్థిక, ఉద్యోగ అవకాశాలు, ఉన్నత విద్య, మెరుగైన జీవనశైలి, ఆర్థిక స్వేచ్ఛ, సాంకేతిక ఆవిష్కరణలలో అగ్రస్థానం, మంచి జీతం వచ్చే ఉద్యోగాలు లభిస్తాయట. ఇంటర్న్‌షిప్‌లు అవకాశాలు సైతం అధికమట. అలాగే తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుందట. అమెరికాలో ఉన్న సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాలలో అవకాశాలు భారతీయులను ఆకర్షిస్తాయట. యూఎస్‌లో టెక్నాలజీ, ఫైనాన్స్, హెల్త్‌కేర్ వంటి రంగాలలో మంచి ఉద్యోగాలు లభిస్తాయట. ఇక్కడ లభించే జీతాలు భారత్‌తో పోలిస్తే చాలా రెట్లు అధికంగా ఉండటం వల్ల అందరూ యూఎస్‌కి పరుగులు తీస్తుంటారని నివేదికలు చెబుతున్నాయి. యూఎస్‌లో పెట్టుబడి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని వెల్లడిస్తున్నాయి. ఇంకా అనేక కారణాలు సైతం ఉండొచ్చు.
READ MORE: Cyberattack: యూరోపియన్ దేశాలపై సైబర్ దాడి.. చిక్కుల్లో వేలాది మంది ప్రయాణికులు
కాగా.. ట్రంప్ భయం ప్రస్తుతం అమెరికాలో స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు 25 ఏళ్ల తర్వాత తొలిసారి అమెరికా (USA) వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం గమనార్హం. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వీసా నిబంధనలు కఠినతరం కావడం, ఇరు దేశాల సంబంధాలు దెబ్బతినడం వంటి అంశాలు దీనికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. అమెరికా కామర్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన నేషనల్ ట్రావెల్ అండ్ టూరిజం డేటా (NTTO) ప్రకారం, ఈ ఏడాది జూన్‌లో అమెరికా (USA) సందర్శించిన భారతీయుల సంఖ్య 2.1 లక్షలు. కానీ గతేడాది ఇదే నెలలో ఈ సంఖ్య 2.3 లక్షలు ఉండగా, ఈసారి 8 శాతం తగ్గుదల నమోదైంది. జులైలో కూడా ఇదే పరిస్థితి కొనసాగి, గత ఏడాదితో పోలిస్తే 5.5 శాతం తగ్గుదల కనిపించింది.
READ MORE: Cyberattack: యూరోపియన్ దేశాలపై సైబర్ దాడి.. చిక్కుల్లో వేలాది మంది ప్రయాణికులు
కానీ.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్య అమెరికాపై ఆధారపడే భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు భారత్ ‘‘విశ్వబంధు’’ స్ఫూర్తితో ముందుకుసాగుతోంది. ప్రపంచంలో మనకు ప్రధాన శత్రువులు ఎవరూ లేరు. మన అతిపెద్ద శత్రువు ఇతరదేశాలపై ఆధారపడటమే అన్నారు. దీన్ని మనం ఓడించాలని. విదేశాలపై ఎక్కువగా ఆధారపడితే.. దేశ అభివృద్ధి విఫలమవుతుందని నొక్కి చెప్పారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం అత్యధిక జనాభా కలిగిన దేశం ఆత్మనిర్భర్‌గా మారాలని.. ఇతరులపై ఆధారపడితే మన ఆత్మగౌరవం దెబ్బతింటుందని ఉద్ఘాటించారు. భారతదేశ అభివృద్ధిని, భావితరాలను పణంగా పెట్టలేమని స్పష్టం చేశారు.