Cyberattack: యూరోపియన్ విమానాశ్రయాలపై శనివారం సైబర్ దాడులు జరిగాయి. లండన్‌లోని హీత్రో, బెల్జియంలోని బ్రస్సెల్స్, జర్మనీలోని బెర్లిన్‌తో సహా అనేక ప్రధాన యూరోపియన్ విమానాశ్రయాలు ఈ దాడికి గురైనట్లు సమాచారం. చెక్-ఇన్ బోర్డింగ్ సిస్టమ్‌లకు సంబంధించిన సేవలను అందించే కాలిన్స్ ఎయిర్‌స్పేస్ అనే సంస్థను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ఈ సైబర్ దాడి దెబ్బకు అనేక విమానాలు రద్దు అయ్యాయి. అలాగే వేలాది మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అనేక యూరోపియన్ విమానాశ్రయాలు ప్రయాణీకులకు వారి విమాన సర్వీస్‌లను తనిఖీ చేసుకోవాలని సూచించాయి. ఆకస్మిక అసౌకర్యానికి విమానయాన సంస్థలు ప్రయాణికులకు క్షమాపణలు తెలిపాయి.
READ ALSO: అమెరికా H1B వీసా ఫీజు పెంపుపై ప్రధాని మోడీ స్పందన !
మాన్యువల్ చెక్-ఇన్ సౌకర్యం కొనసాగుతోంది..
మాన్యువల్ చెక్-ఇన్.. బోర్డింగ్‌లపై మాత్రమే ఈ సైబర్ దాడి జరిగిందని బ్రస్సెల్స్ విమానాశ్రయం ఒక ప్రకటనలో పేర్కొంది. బెర్లిన్‌లోని బ్రాండెన్‌బర్గ్ విమానాశ్రయ అధికారులు మాట్లాడుతూ.. ప్రయాణీకుల నిర్వహణ వ్యవస్థ కోసం ఏర్పాటు చేసిన ఒక సర్వీస్ ప్రొవైడర్‌పై ఈ సైబర్ దాడి జరిగిందని, దీనితో ఈ వ్యవస్థను డిస్‌కనెక్ట్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. యూరప్‌లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం అయిన హీత్రో దీనిని సాంకేతిక సమస్యగా అభివర్ణించింది. చెక్-ఇన్, బోర్డింగ్ సిస్టమ్ సేవలను ఇది ప్రభావితం చేసిందని తెలిపింది. “ప్రపంచవ్యాప్తంగా అనేక విమానాశ్రయాలలో చెక్-ఇన్, బోర్డింగ్ సిస్టమ్ సేవలను అందించే కంపెనీ సాంకేతిక సమస్యను ఎదుర్కొంటోంది. దీని వలన విమానాల్లో ప్రయాణం చేసే ప్రయాణీకులకు ఆలస్యం కావచ్చు” అని ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సైబర్ దాడి ప్రభావం కొన్ని విమానాశ్రయాలలో మాత్రమే కనిపించిందని ఫ్రాన్స్ పేర్కొంది. పారిస్‌లోని రోయ్సీ, ఓర్లీ, లె బోర్గెట్ విమానాశ్రయాలలో ఎటువంటి సమస్యలు లేవని చెప్పింది.
సైబర్ దాడి ఏ సర్వీస్ ప్రొవైడర్‌పై జరిగింది..
అమెరికన్ ఏవియేషన్, డిఫెన్స్ టెక్నాలజీ కంపెనీ అయిన కాలిన్స్ ఏరోస్పేస్ పోర్టల్‌పై ఈ సైబర్ దాడి జరిగింది. ఇది గతంలో రేథియాన్ టెక్నాలజీస్ అయిన RTX కార్ప్ అనుబంధ సంస్థ. ఇది నేరుగా ప్రయాణీకుల చెక్-ఇన్‌ను అందించదని, బదులుగా ప్రయాణీకులు కియోస్క్ యంత్రాల వద్ద తమను తాము చెక్-ఇన్ చేసుకోవడానికి, బోర్డింగ్ పాస్‌లు, బ్యాగేజ్ ట్యాగ్‌లను ప్రింట్ చేయడానికి, వారి స్వంత లగేజీని డెలివరీ చేయడానికి అనుమతించే సాంకేతికతను అభివృద్ధి చేస్తుందని కంపెనీ పేర్కొంది. “ఎంపిక చేసిన విమానాశ్రయాలలో మా MUSE సాఫ్ట్‌వేర్‌తో సైబర్ సమస్య ఉందని మాకు తెలిసింది. ఇది ఎలక్ట్రానిక్ చెక్-ఇన్, సామాను సేకరణను మాత్రమే ప్రభావితం చేసింది, అయితే మాన్యువల్ చెక్-ఇన్‌కు తిరిగి మారడం ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు” అని కంపెనీ తెలిపింది.
READ ALSO: Taliban Rejects US Proposal: అమెరికాను ఛీ కొట్టిన తాలిబన్లు.. ఇది అగ్రరాజ్యానికి అవమానమే!