Police Commemoration Day: నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం.. అసలు ఎందుకు జరుపుకొంటారో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Commemoration Day: నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. గోషామహల్ లోని పోలీస్ మార్టియర్స్ మెమోరియల్‌లో పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ముఖ్యఅతిధిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. సీఎం రేవంత్, డీజీపీ శివధర్‌రెడ్డి, ఇతర పోలీస్ అధికారులు అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ విభాగం త్యాగస్ఫూర్తిని స్మరించుకునేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు.. నేటి నుంచి వారం రోజుల పాటు వారోత్సవాలు కొనసాగనున్నారు. ఇదిలా ఉండగా.. అసలు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకొంటామో ఇప్పుడు తెలుసుకుందాం..
READ MORE: CM Chandrababu: గూగుల్ పెట్టుబడి వైజాగ్కి రావడానికి కారణం లా అండ్ ఆర్డర్..
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఏటా అక్టోబర్ 21నే పోలీస్ అమలరవీరుల దినత్సోవం జరుపుకుంటాం. ఇందుకు ప్రధాన కారణం 1959, అక్టోబర్ 21, భారత్–చైనా సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. వాస్తవానికి.. మిలటరీ ఎత్తుగడలకు చైనా సరిహద్దులోని భారత భూభాలైన లడఖ్, సియాచిన్ ప్రాంతాలు కీలకమైనవి. సరిహద్దు భద్రతాదళం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతాదళాలు ఏర్పడక ముందు సరిహద్దులను రక్షించే బాధ్యతను కేంద్ర రిజర్వు పోలీస్ ఫోర్స్ (CRPF) బలగాలు నిర్వర్తించేవి. 1959 అక్టోబరు 21న అక్సాయ్ చిన్‌లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్ కు చెందిన 21 మంది సభ్యుల బృందంపై చైనా దళాలు మెరుపుదాడి చేశాయి. చైనా రక్షణ బలగాలు సియాచెన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో సీఆర్పీఎఫ్ దళం హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో దీటుగా ఎదురొడ్డి పోరాడింది.
READ MORE: RAPO : రామ్ – భాగ్యశ్రీ.. లవ్ కన్ఫమ్ చేసిన ‘చౌ మామ’..
ఎలాంటి కవ్వింపులు లేకపోయినా చైనా బలగాలు జరిపిన కాల్పుల్లో 10 మంది భారత పోలీసులు బలయ్యారు. మృతదేహాలను 23 రోజుల తర్వాత అంటే 1959, నవబంర్ 12న చైనా అప్పగించింది. వీరులకు సైనిక గౌరవాలతో అంత్యక్రియలు జరిగాయి. మరుసటి ఏడాది అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరులు దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి ఏటా నివాళులు అర్పిస్తున్నారు. పోలీసు స్మారక దినోత్సవం 1959లో మరణించిన పోలీసుల గౌరవార్థం, వారిని స్మరించుకోవడానికి నిర్వహించుకుంటున్నాం. ఈ రోజు వారు అందించిన సేవలను గుర్తు చేసుకుంటాం. దేశీయంగా లేదా అంతర్జాతీయంగా విధి నిర్వహణలో అమరుల త్యాగాలను కూడా ఈరోజు స్మరించుకుంటున్నాం. 2018 అక్టోబర్ 21న జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ నేషనల్ పోలీస్ మెమోరియల్‌ను అంకితం చేశారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!