Manipur Violence: మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ఎందుకు చోటుచేసుకున్నాయి. సమస్యలేంటీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur Violence: మణిపూర్‌లో హింసాత్మక ఘటనలతో అడ్డుడికిపోతుంది. అసలు అలాంటి ఘటనలు ఎందుకు చోటుచేసుకున్నాయి. అనే కారణాలు, పరిస్థితులపై మాజీ అసోం డీజీపీ, అసోం పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పల్లబ్ భట్టాచార్య చర్చించారు. మైతేయిలకు ఎస్టీ హోదా ఇవ్వరాదని ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ మణిపూర్.. ట్రైబల్ సంఘీభావ ర్యాలీ చేపట్టిన తర్వాత ఆ రాష్ట్రంలో హింస మొదలైంది. స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి మణిపూర్ లో ఇప్పటి వరకు ఎన్నో పొరపాట్లు, సమస్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
Read Also: Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదానికి అసలు కారణం ఇదే..!
Also Read
- Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
- MK Stalin: 'డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్'.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
- New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
అందుకు గల కారణాలు, తప్పులు నాలుగు ఉన్నాయి. అందులో మొదటిది.. బ్రిటీష్ ఇండియాలో మణిపూర్ రాష్ట్ర చేరిక జరిగింది. 1930వ దశకం మలి సంవత్సరాల్లో మణిపూర్ సంస్థానం బర్మాలో కాకుండా బ్రిటీష్ పాలిత భారత్‌లో చేరాలని ప్రతిపాదించింది. 1935లో స్వాతంత్ర్య సమరాన్ని బలహీనపరచడానికి బ్రిటీషర్లు భారత్ నుంచి బర్మాను వేరుచేశారు. 1947 ఆగస్టు 11న చేరికపై మహారాజా బుధాచంద్ర సంతకం చేయగా.. 1949 సెప్టెంబర్ 21వ తేదీన విలీన ఒప్పందంపై సంతకం పెట్టారు. ఈ నిర్ణయాన్ని కొన్ని మణిపూర్ గ్రూపులు వ్యతిరేకించాయి. నిర్ణయంపై ఏకాభిప్రాయం రాకముందే విలీనం చేశారని మైతేయి తిరుగుబాటు చేశారు.
Read Also: Tollywood: ఒడిశా రైలు ప్రమాదం.. తల్లడిల్లుతున్న టాలీవుడ్
రెండో సమస్య.. మణిపూర్ జనాభా 2011 లెక్కల ప్రకారం, 41.39 శాతం హిందువులు, 41.29 శాతం క్రిస్టియన్లు, 8.39 శాతం ముస్లింలు, మిగిలినవారు జైనులు, బుద్ధులు మొదలగువారు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 28.6 లక్షల జనాభా ఉండగా.. ట్రైబల్ జనాభా 11.67 లక్షల మంది ఉన్నారు. ఇందులో ఎక్కువ మంది క్రిస్టియన్లే ఉన్నారు. మూడో సమస్య ఏంటంటే.. 53 శాతం జనాభా కేవలం లోయలో నివసిస్తున్నారు. వీరికి 40 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే 90 శాతం కొండ ప్రాంతాల ప్రజలను కేవలం 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 53 శాతం జనాభా గల మైతేయీలు ఆ లోయకే పరిమితం అయ్యారు. ఇది ట్రైబల్ కమ్యూనిటీలు నాగాలు, కుకీల మధ్య ఘర్షణాపూరిత వాతావరణానికి కారణంగా మారింది.
Read Also: Hero Bike: హీరో బైక్ కి USB ఛార్జింగ్…ట్యూబ్‌లెస్ టైర్లు.. దీని ధర తెలిస్తే షాకే..!
ఇక నాలుగో సమస్య విషయానికొస్తే.. మణిపూర్ రీజియన్. దీనికి ఒక వైపు మిజోరం, అసోం, నాగాల్యాండ్‌లు ఉండగా.. మరో వైపు 352 కిలోమీటర్ల చొప్పున మయన్మార్ సరిహద్దు ఉంటుంది. ఫ్రీ మూవ్‌మెంట్ రెజీమ్ ద్వారా 16 కిలోమీటర్ల మేరకు సరిహద్దులో నివసించే వారు ఎదుటి దేశంలో వీసా లేకుండా వెళ్లడానికి ఆస్కారం ఉన్నది. ఈ సరిహద్దు గుండా కుకీలు చొరబడుతున్నారని, వారి జనాభా పెంచుకుని ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్నారని మైతేయీల వాదన. ఇదిలా ఉండగా మైతేయీల ఎస్టీ డిమాడ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు రాష్ట్రానికి ఇచ్చిన ఆదేశాలను జారీ చేసింది. దీంతో మైతేయీలు తమ వాటానూ భుక్తం చేస్తారని, వారి పలుకుబడిపై నమ్మకంతో ట్రైబల్స్ భావించారు. కానీ, అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల్లో అధికంగా కుకీలే ఉన్నారని మైతేయీలు తిరిగి వాదిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల కారణంగా అక్కడ హింస చెలరేగినప్పుడు కేంద్రం వెంటనే కట్టడి చర్యలు తీసుకోలేదు. కానీ, ఇప్పుడు వేగంగా పరిస్థితులు అదుపులోకి తెచ్చింది.
తాజావార్తలు
-
Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
-
MK Stalin: ‘డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!