నిన్న ( శుక్రవారం ) సాయంత్రం ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొనడానికి ముందు క్షణాల్లో రైలు ట్రాఫిక్‌ను ట్రాక్ చేసే భారతీయ రైల్వే వ్యవస్థ తప్పిందం వల్ల ఘోర ప్రమాదం జరిగింది. దాదాపు 288 మందికి పైగా మరణించాగా.. సుమారు 1000 మందికి పైగా గాయపడ్డారు. అయితే సిగ్నలింగ్ వైఫల్యమే ఒడిశా రైలు ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఒడిశా రైలు ప్రమాదం సిగ్నలింగ్ వైఫల్యం ఫలితంగా జరిగిందని అధికారుల సంయుక్త తనిఖీ నివేదిక పేర్కొంది.
Also Read : Andhra Pradesh: పసికందు ప్రాణం తీసిన మద్యం మత్తు..దారుణం..
రైలు నంబర్ 12841కోరమండల్ ఎక్స్‌ప్రెస్ కు అప్ మెయిన్ లైన్ కోసం సిగ్నల్ ఇచ్చారు. కానీ రైలు లూప్ లైన్‌లోకి ప్రవేశించి, అప్ లూప్ లైన్‌లో ఉన్న గూడ్స్ రైలుతో ఢీకొని పట్టాలు తప్పిందని ప్రాథమిక నివేదికను వెల్లడించింది. దీనివల్ల కోరమండల్ రైలులో 19 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ సమయంలో రైలునంబర్ 12864 దిగువ మెయిన్ లైన్ లో రెండు కోచ్‌లు పట్టాలు తప్పి బోల్తా పడ్డాయి.
Also Read : Odisha Train Accident LIVE UPDATES: ఒడిశా రైలు ప్రమాదం.. ప్రాథమిక రిపోర్ట్‌లో కీలక అంశాలు
బెంగళూరు-హౌరా రైలు పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లను ఢీకొట్టింది. అయితే, కొంతమంది రైల్వే నిపుణులు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ నేరుగా “లూప్ లైన్” లోపల గూడ్స్ రైలును ఢీకొట్టి ఉండవచ్చు అని అనుమానిస్తున్నారు. విజువల్స్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఇంజన్ గూడ్స్ రైలు పైభాగంలో ఉన్నట్లు చూపిస్తుంది. ఇది నేరుగా ఢీకొనడాన్ని సూచిస్తుంది. ఒక “లూప్ లైన్” ప్రధాన రైల్వే ట్రాక్‌ల నుంచి విడిపోతుంది.. కొంత దూరం తర్వాత మెయిన్‌లైన్‌కి తిరిగి వస్తుంది. ఇవి రద్దీగా ఉండే రైలు ట్రాఫిక్‌ని నిర్వహించడానికి సహాయపడతాయి. సిగ్నల్ సిస్టమ్ తప్పిదం, మానవ తప్పిదం, విధ్వంసం వంటి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.