మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాత్మకమైన ఘటనలపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. హింసను మరింత పెంచేందుకు తమను వాడుకోవద్దని సుప్రీంకోర్టు కోరింది. ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని తాము పర్యవేక్షిస్తామని, మరిన్ని చర్యలకు అవసరమైతే తగిన ఆదేశాలను జారీ చేస్తామని చెప్పారు.. అంతేకానీ భద్రతా యంత్రాంగాన్ని తాము నడపలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మణిపూర్ లో అల్లర్లను కట్టడి చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ఈ కామెంట్స్ చేసింది.
మణిపూర్‌లో హింసాత్మక ఘటనలతో అడ్డుడికిపోతుంది. అసలు అలాంటి ఘటనలు ఎందుకు చోటుచేసుకున్నాయి. అనే కారణాలు, పరిస్థితులపై మాజీ అసోం డీజీపీ, అసోం పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పల్లబ్ భట్టాచార్య చర్చించారు. మైతేయిలకు ఎస్టీ హోదా ఇవ్వరాదని ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ మణిపూర్.. ట్రైబల్ సంఘీభావ ర్యాలీ చేపట్టిన తర్వాత ఆ రాష్ట్రంలో హింస మొదలైంది.