Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Why Criminalise Triple Talaq When Says Kerala Chief Minister

Triple Talaq: విడాకులు ముస్లింలలోనే ఎందుకు నేరం.. కేరళ సీఎం సంచలన వ్యాఖ్యలు

Published Date :February 21, 2023 , 4:37 pm
By Mahesh Jakki
Triple Talaq: విడాకులు ముస్లింలలోనే ఎందుకు నేరం.. కేరళ సీఎం సంచలన వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kerala Chief Minister on Triple Talaq: ముస్లింలు ఆచరించే త్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇటీవలే చట్టం చేసింది. వివాదాస్పద త్రిపుల్ తలాక్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి గతంలో వివాదాస్పదమైంది. ఇప్పుడు మరోసారి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. అన్ని మతాలలో విడాకులు జరిగినప్పుడు ముస్లింలలో తక్షణ విడాకుల పద్ధతిని ఎందుకు నేరంగా పరిగణిస్తారని ఆయన ప్రశ్నించారు.

విడాకులనేవి అన్ని మతాల్లో జరుగుతున్నప్పటికీ.. కేవలం ముస్లింలలో త్రిపుల్ తలాక్ మాత్రమే ఎందుకు నేరంగా పరిగణించాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశ్నించారు. ఇతర మతాల్లో విడాకుల కేసును సివిల్ కేసుగా చూస్తున్నప్పుడు..ఇస్లాంలోని త్రిపుల్ తలాక్ క్రిమినల్ కేసు ఎలా అవుతుందన్నారు. కేరళలో సీఏఏ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమలు చేయమని ముఖ్యమంత్రి విజయన్ చెప్పారు. ఒక్కో మతానికి ఒక్కో రకమైన శిక్షను విధించవచ్చా అని ప్రశ్నించారు. ఓ మతాన్ని అనుసరించేవారికి ఒక చట్టం, మరో మతాన్ని అనుసరించేవారికి ఇంకో చట్టం ఉండవచ్చా అని నిలదీశారు. కేరళలోని కాసరగోడ్‌లో అధికార సీపీఎం మార్చ్ ‘జనకీయ ప్రతిరోధ జాధా’ను ప్రారంభిస్తూ కేరళ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుండి మైనారిటీ హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు, పార్సీలకు పౌరసత్వం మంజూరు చేయడానికి కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) చట్టాన్ని కేరళలో అమలు చేయబోమని ముఖ్యమంత్రి విజయన్ తెలిపారు.

Javed Akhtar: పాక్‌లో జావెద్.. దాయాది దేశంలోనే 26/11 ఉగ్రవాదులపై సంచలన వ్యాఖ్యలు

దేశంలో అందరూ భారతీయులేనని, ఫలానా మతంలో పుట్టినందుకే పౌరసత్వం వస్తుందని ఎలా చెప్పగలమన్నారు. పౌరసత్వానికి మతం ప్రాతిపదిక ఎలా అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం ద్వారా పౌరసత్వాన్ని ఇచ్చేందుకు మతాన్ని ఉపయోగిస్తుందన్నారు. రాష్ట్రంలో మాత్రం అమలు చేయబోమని తెలిపారు. మ్యాట్రిమోనియల్ విడాకుల విషయంలో ఒక దేశం ప్రత్యేక శిక్షా ప్రమాణాలను కలిగి ఉండగలదా అని ఆయన ప్రశ్నించారు. ముస్లింలలో తలాక్..తలాక్..తలాక్ అని మూడు సార్లు ఉచ్ఛరించడం ద్వారా భార్యలకు విడాకులిచ్చే పద్ధతి గతంలో ఉండేది. ఇది రాజ్యాంగ విరుద్ధమని 2017లో సుప్రీంకోర్టు తెలిపింది. ఆ మరుసటి ఏడాది ముస్లిం మహిళల ఆర్జినెన్స్ 2018ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించగా, రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. అప్పట్నించి దేశంలో త్రిపుల్ తలాక్ అనేది నాన్ బెయిలబుల్ నేరంగా మారడం గమనార్హం.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • cpi
  • Kerala
  • Kerala Chief Minister
  • muslim marriages

తాజావార్తలు

  • IPL 2026 vs Peddi: ఐపీఎల్ ఫీవర్ మధ్య రిలీజ్.. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాకి అసలైన పరీక్ష తప్పదా?

  • Husband K*illed: పెళ్లికి ముందే ప్రభుత్వ ఉపాధ్యాయుడితో ప్రేమ.. ఇష్టం లేని వివాహం చేసుకుని భర్తను..

  • MI Captaincy: “సూర్యను కెప్టెన్ చేయకపోతే హార్దిక్‌కు కష్టాలు తప్పవు”.. దిగ్గజ స్పిన్నర్ ఘాటు వ్యాఖ్యలు!

  • India Lok Sabha Seats Increase: లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. 2029 ఎన్నికల నుంచే అమలు, తెలంగాణలో ఎన్ని పెరుగుతాయంటే?

  • AI+ Nova 2 Ultra 5G: ఏఐ+ నోవా 2 అల్ట్రా 5జీ నోటిఫికేషన్ రింగ్ లైట్ ఫీచర్‌ తో.. రిలీజ్ కు రెడీ..

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions