Vaibhav: ఒక్కో రన్‌కు రూ.14 వేల సంపాదన.. భారీగా పెరిగిన వైభవ్ బ్రాండ్ వ్యాల్యూ.. ఇక్కడే బిగ్ ట్విస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో అందరి కళ్లూ 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే ఉన్నాయి. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ కేవలం 16 మ్యాచ్‌ల్లోనే 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్‌తో పాటు ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’ అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు. ఈ పరుగుల వేటతో అతని సంపాదన సైతం భారీగా పెరిగింది. ఐపీఎల్ కాంట్రాక్ట్ ద్వారా ఏడాదికి రూ. 1.10 కోట్లు అందుకుంటున్న వైభవ్ చేసిన పరుగుల లెక్కన చూస్తే, అతను చేసిన ప్రతి రన్‌కు దాదాపు రూ. 14,000 లభిస్తున్నట్లు లెక్క. ఈ అద్భుత ప్రదర్శన తర్వాత అతని బ్రాండ్ విలువ పెరిగి, ఎండార్స్మెంట్ ఫీజు ప్రతి డీల్‌కు రూ. 50 లక్షల నుంచి రూ. 1.5 – 2 కోట్ల వరకు చేరింది. అయినప్పటికీ, మార్కెట్లో పెద్ద ఆటోమొబైల్, లైఫ్‌స్టైల్ బ్రాండ్లు అతనితో ప్రకటనలు చేయడానికి వెనకాడుతున్నాయి. దీని వెనుక కొన్ని ఆసక్తికరమైన కారణాలు, చట్టపరమైన చిక్కులు ఉన్నాయి.
చట్టపరమైన అడ్డంకులు
వైభవ్ వయసు ప్రస్తుతం కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. ఐపీఎల్లో ‘సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్’గా నిలిచినందుకు అతనికి ‘టాటా సియెర్రా’ కారు బహుమతిగా లభించినప్పటికీ, భారతీయ చట్టాల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ రావడానికి కనీసం 18 ఏళ్లు నిండాలి. కాబట్టి అతను ఆ కారును చట్టబద్ధంగా నడపలేడు. ఇదే కారణంతో ఏ ఆటోమొబైల్ కంపెనీ కూడా మైనర్ అయిన వైభవ్‌ను తమ వాహనం నడుపుతున్నట్లు అడ్వర్టైజ్మెంట్లలో చూపించలేదు. అలా చూపిస్తే సమాజంలోకి తప్పుడు సందేశం వెళ్తుందని, చట్టపరమైన వివాదాలు వస్తాయని కంపెనీలు భయపడుతున్నాయి. మరోవైపు, లైఫ్‌స్టైల్ విభాగంలో వయోజనులను (Adults) టార్గెట్ చేసే డియోడరెంట్లు, మెన్స్ గ్రూమింగ్ ప్రొడక్ట్స్ (గడ్డం నూనెలు, షేవింగ్ కిట్లు), లగ్జరీ వాచీలు, లేదా ఫాంటసీ గేమింగ్ యాప్‌ల ప్రకటనల్లో 15 ఏళ్ల బాలుడిని చూపించడానికి కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) నిబంధనలు అంగీకరించవు. క్రెడిట్ కార్డులు, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఆర్థిక ఉత్పత్తుల ప్రచారానికి సైతం మైనర్లను దూరంగా ఉంచుతారు.
Also Read
- Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
- Arnab Cyclone Alert: బీభత్సం సృష్టిస్తోన్న అర్నబ్ తుఫాన్.. తీరం దాటేది ఇక్కడే..!
- Pak Vs SL: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. ఫైనల్‌కు చేరుకున్న శ్రీలంక..
- Story Board: లిక్విడ్ క్యాష్ గగనమైపోయిందా..? ప్లాస్టిక్ కరెన్సీకి, నగదు కొరతకూ లింక్ ఉందా..?
బ్రాండ్ల కొత్త వ్యూహం..
పూర్వంలా కాకుండా ప్రస్తుత రోజుల్లో బ్రాండ్లు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. గతంలో క్రికెటర్లతో 3 నుంచి 5 ఏళ్ల సుదీర్ఘ ఒప్పందాలు చేసుకునే కంపెనీలు, ఇప్పుడు వైభవ్ వంటి యువ ఆటగాళ్లతో కేవలం 2 నుంచి 3 ఏళ్ల స్వల్పకాలిక కాంట్రాక్టులకే మొగ్గు చూపుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో అతని ప్రదర్శన ఎలా ఉంటుందో చూసిన తర్వాతే పూర్తిస్థాయిలో ముందుకెళ్లాలని భావిస్తున్నాయి. అయితే, స్పోర్ట్స్ డ్రింక్స్, క్రికెట్ బ్యాట్లు, న్యూట్రిషన్, హై-పర్ఫార్మెన్స్ షూ కంపెనీలు మాత్రం అతన్ని సైన్ చేయడానికి క్యూ కడుతున్నాయి. వీటన్నింటి మధ్య వైభవ్ కుటుంబం, అతని ఐపీఎల్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ అతన్ని గ్లామర్ ప్రపంచానికి, మితిమీరిన కమర్షియలైజేషన్‌కు దూరంగా ఉంచాలని భావిస్తున్నారు. ప్రకటనల హడావుడి వల్ల ఆట దెబ్బతినకూడదనేది వారి ఆలోచన. అందుకే ప్రస్తుతం అతని వయసుకు సరిపోయే ‘కాంప్లాన్’ (Complan), గూగుల్ పే కి సంబంధించిన ‘పాకెట్ మనీ యాప్’ వంటి సురక్షితమైన బ్రాండ్లను మాత్రమే వైభవ్ ప్రమోట్ చేస్తున్నాడు.
అంతర్జాతీయ ఎంట్రీతో మారనున్న నెట్‌వర్త్
ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ అంచనా నెట్‌వర్త్ (ఆస్తి విలువ) దాదాపు రూ. 3 కోట్ల వరకు ఉంది. ఇంగ్లాండ్‌తో జరగబోయే తదుపరి మ్యాచ్‌లలో అతను ఆడే అవకాశంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఒకవేళ అతను భారత అంతర్జాతీయ జట్టులో స్థానం సంపాదించుకుంటే, బీసీసీఐ (BCCI) కాంట్రాక్ట్ ద్వారా అతని ఆదాయం మరింత పెరుగుతుంది. ఒకవేళ బీసీసీఐ అతన్ని గ్రేడ్-సి లో చేరిస్తే రూ. 1 కోటి, గ్రేడ్-బి లో చేరిస్తే రూ. 3 కోట్లు, లేదా నేరుగా గ్రేడ్-ఎ లో అవకాశం కల్పిస్తే ఏడాదికి రూ. 5 కోట్ల శాలరీ లభిస్తుంది. దీనివల్ల అతని నెట్‌వర్త్ ఒక్కసారిగా ఊహించని స్థాయికి దూసుకెళ్లే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!