IPL Auction 2025: ఈసారి మెగా వేలంలో నిలిచిన పిన్న వయస్కుడైన ఆటగాడు ఇతనే..!
- నవంబర్ 24, 25 తేదీలలో జెద్దా (సౌదీ అరేబియా)లో ఐపీఎల్ మెగా వేలం
- 574 మంది ఆటగాళ్ల పేర్లు బీసీసీఐ షార్ట్‌లిస్ట్
- 366 మంది భారతీయ ఆటగాళ్లు, 208 మంది విదేశీ ఆటగాళ్లు
- అత్యంత పిన్న వయస్కుడు 14 ఏళ్లు, పెద్ద వయసు ఆటగాడు 42 ఏళ్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీలలో జెద్దా (సౌదీ అరేబియా)లో జరుగనుంది. ఈసారి వేలంలో 574 మంది ఆటగాళ్ల పేర్లను బీసీసీఐ షార్ట్‌లిస్ట్ చేసింది. అందులో 366 మంది భారతీయ ఆటగాళ్లు ఉండగా.. 208 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అయితే.. ఈసారి ఐపీఎల్ వేలంలో నిలిచిన అత్యంత పిన్న వయస్కుడు 14 ఏళ్లు కాగా, పెద్ద వయసు ఆటగాడు 42 ఏళ్లు.
Crime: రోడ్డు పక్కన సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం..
Also Read
అతి పిన్న వయస్కుడైన ఆటగాడు వైభవ్ సూర్యవంశీ:
ఐపీఎల్ 2025 వేలంలో నిలిచిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడు వైభవ్ సూర్యవంశీ, అతనికి 14 సంవత్సరాలు. వైభవ్ సూర్యవంశీ బీహార్ తరపున ఆడుతున్నాడు. అతను ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్, స్పిన్ బౌల్ కూడా చేస్తాడు. ఈ రంజీ సీజన్లో వైభవ్ బీహార్ తరఫున ఆడుతున్నాడు. ఈ వేలంలో అతని బేస్ ధర రూ. 30 లక్షలు. ఈ వేలంలో పాల్గొన్న అతి పెద్ద వయసు ఆటగాడు జేమ్స్ అండర్సన్, ఇతనికి 42 ఏళ్లు. ఈ వేలంలో అండర్సన్ తన బేస్ ధరను రూ.1.25 కోట్లుగా ఉంచుకున్నాడు.
81 మంది ఆటగాళ్లు రూ.2 కోట్ల స్లాబ్‌లో ఉన్నారు:
ఐపీఎల్ 2025 వేలంలో రూ. 2 కోట్ల బేస్ ధర కలిగిన మొత్తం ఆటగాళ్ల సంఖ్య 81 ఉండగా.. రూ. 1.25 కోట్ల స్లాబ్‌లో 18 మంది ఆటగాళ్లు ఉన్నారు. రూ. 1.5 కోట్ల బేస్ ధర కలిగిన ఆటగాళ్ల సంఖ్య 27 ప్లేయర్లు ఉండగా.. మొత్తం 23 మంది ఆటగాళ్లను కోటి రూపాయల ధర స్లాబ్‌లో చేర్చారు. ఈసారి 92 మంది ఆటగాళ్లకు రూ.75 లక్షలు, 8 మంది ఆటగాళ్లకు రూ.50 లక్షలు, 5 మంది ఆటగాళ్లకు రూ.40 లక్షలు బేస్ ధరగా నిర్ణయించారు. ఈసారి 320 మంది ఆటగాళ్లు తమ పేర్లను రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో నమోదు చేసుకున్నారు.
తాజావార్తలు
-
Uttam Kumar Reddy: కమిషన్ల కక్కుర్తి వల్లే బ్యారేజీలు కూలాయి.!
-
Student Suicides: మార్కులు తక్కువ వచ్చాయనే మనస్తాపం.. రెండు కుటుంబాల్లో కన్నీటి విషాదం
-
BE ALERT: గుండు గీకిన బంటు..తమిళనాడులో విక్రమార్కుడు సీన్..
-
Humanoid Robot: రూ.3,000 ఇస్తే చాలు… మీ ఇంట్లోని చెత్తంతా ఎత్తి పడేస్తుంది..
-
Love Fail: లవర్ హ్యాండ్ ఇచ్చాడని మనస్తాపం… సీపీఆర్ చేసినా దక్కని యువతి ప్రాణాలు..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!