NTV Telugu Site icon

Kishan Reddy: కాంగ్రెస్ ఎక్కడుంటే అక్కడే మత కల్లోలాలు, కర్ఫ్యూ, కరప్షన్ ఉంటాయి..

Kishanreddy

Kishanreddy

వచ్చే నెల 13వ తేదీన లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఎవరు ప్రధాని కావాలి, ఎవరు అధికారంలోకి రావాలని నిర్ణయించే ఎన్నికలు ఇవి.. గత తొమ్మిదిన్నర ఏళ్లుగా మోడీ ఏ విధంగా పని చేశారో చూశాం.. కరోనా కష్ట కాలంలో మనల్ని ఆదుకున్నారు.. ఉచిత వ్యాక్సిన్ ఇచ్చారు.. కరోనా కష్టాల్లో ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నాడు మోడీ.. ఇంకో ఐదేళ్లు ఇస్తామని చెప్పాడు.. మహిళా సంఘాలకు 20 లక్షల రూపాయల లోన్ ఇస్తామన్నాడు.. మహిళలు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసేలా మోడీ కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 20 లక్షల రూపాయలే కాదు అవసరమైతే 50 లక్షల రూపాయల లోన్ ఇస్తామన్నారు. చట్ట సభల్లో మహిళల రిజర్వేషన్ బిల్లు తెచ్చాం అని కిషన్ రెడ్డి చెప్పారు.

Read Also: Hyderabad: రాచకొండలో భారీగా డ్రగ్స్ పట్టివేత

కాంగ్రెస్ ఎక్కడుంటే మత కల్లోలాలు, కర్ఫ్యూలు, కరప్షన్ ఉంటుంది అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. స్వాత్యంత్రం వచ్చాక ఒక బీసీ నాయకుడు ప్రధాని అయ్యాడు.. దేశంలో అద్భుతమైన రహదారులు వేశాం.. రైల్వే స్టేషన్లు అద్భుతంగా నిర్మిస్తున్నాం.. కొత్త ట్రైన్స్ నడుపుతున్నాం.. సిటీలో పేదలకు ఎంఎంటీఎస్ లు నడుపుతున్నాం.. గత పదేళ్లుగా తెలంగాణ అభివృద్ధి కోసం 10 లక్షల కోట్ల రూపాయలను మోడీ ఇచ్చాడని తెలిపారు. ఇవి తెలంగాణ ఎన్నికలు కావు.. దేశ ఎన్నికలు అని ఆయన అన్నారు. మోడీతోనే దేశం.. తెలంగాణ అభివృద్ధి సాధ్యం అవుతుంది.. నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.