మాస్ మహారాజా రవితేజ హీరో గా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘మిస్టర్ బచ్చన్’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇటీవలే హైదరాబాద్‌లో గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్ పోస్టర్‌లో రవితేజ తన ఫేవరేట్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ పోజ్‌లో కనిపిస్తూ మూవీ లవర్స్‌ను ఎంతగానో ఇంప్రెస్ చేస్తున్నాడు.కాగా ఇప్పుడీ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. తాజా సమాచారం ప్రకారం మిస్టర్ బచ్చన్ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 28 నుంచి హైదరాబాద్‌లో మొదలు కానుంది. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలను రవితేజ టీం వెల్లడించనుందని సమాచారం.
రవితేజ ఈగల్ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తూనే.. మరోవైపు మిస్టర్ బచ్చన్ షూటింగ్‌తో బిజీ కానున్నాడు.ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.రవితేజ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ కు వీరాభిమాని అనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో తాజా సినిమాకు మిస్టర్ బచ్చన్ టైటిల్ పెట్టడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.’మిస్టర్ బచ్చన్..నామ్ తో సునా హోగా’ అని రవితేజ చెప్పిన డైలాగ్‌తో ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. రవితేజ ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్ అభిమానిగా కనిపిస్తారని సమాచారం.దర్శకుడు హరీష్ శంకర్ ఇదివరకే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ సినిమాను మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి కొంతభాగం షూటింగ్ కూడా పూర్తి అయింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ రాజకీయలలో బిజీగా ఉండటంతో షూటింగ్ ఆలస్యం కానున్నట్లు సమాచారం. దీనితో ఈ గ్యాప్ లో రవితేజ తో మిస్టర్ బచ్చన్ మూవీ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.