iPhone Fold: ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ విడుదల ఎప్పుడు?.. ప్రత్యేకతలు ఏమిటి? పూర్తి వివరాలు
- ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్
- సెప్టెంబర్లో ఐఫోన్ 18 ప్రో మోడళ్లతో పాటు
- 48-మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్, 48-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ సంవత్సరం, ఆపిల్ వరల్డ్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్న రెండు ప్రొడక్ట్స్ ను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అవి ఏఐ (AI) సామర్థ్యం గల సిరి, ఐఫోన్ ఫోల్డ్. ఈ రెండు రంగాలలోనూ ఆపిల్ ప్రస్తుతం పోటీదారుల కంటే వెనుకబడి ఉంది. ఇప్పుడు దాదాపు ప్రతి స్మార్ట్ఫోన్ కంపెనీ ఏఐ ఫీచర్లను అందిస్తున్నప్పటికీ, ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను 2019లో సామ్ సంగ్ పరిచయం చేసింది. అప్పటి నుండి పలు తయారీదారులు కనీసం ఒక ఫోల్డబుల్ మోడల్ను విడుదల చేశారు.
Also Read:Almond Protest: బాదం తిని ఫైల్ గుర్తు చేసుకోండి.. ఫైల్ మరచిపోయిన అధికారికి బాదంతో యువకుడి నిరసన
Also Read
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- IND Vs WI: యశస్వి జైస్వాల్కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Off The Record: ఖైరతాబాద్లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
ప్రస్తుతం, ఆపిల్ తన ఫోల్డబుల్ ఫోన్ను అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఆ సంస్థ ఫోల్డబుల్ మార్కెట్లోకి ప్రవేశిస్తోందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఫోల్డబుల్ మార్కెట్లో ఆపిల్ ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ. అది తన పరికరాలలో కొత్త, ప్రత్యేకమైన వాటిని అందించడంలో ప్రసిద్ధి చెందింది. మరింత సహజమైన స్క్రీన్ అనుభవం కోసం, స్క్రీన్ మడతలను తగ్గించి, మరింత మన్నికైన హింజ్ను ఆపిల్ అభివృద్ధి చేసిందని నివేదికలు సూచిస్తున్నాయి. ఆ సంస్థ సామ్ సంగ్ తాజా M16 OLED ప్యానెళ్లను ఉపయోగించవచ్చని కూడా నివేదికలు ఉన్నాయి.
సాధారణంగా ఆపిల్ కొత్త ఐఫోన్లను విడుదల చేసే సెప్టెంబర్ నెల సమీపిస్తున్న కొద్దీ, ఐఫోన్ ఫోల్డ్ గురించి మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. దీని లభ్యతపై కొంత అనిశ్చితి ఉన్నప్పటికీ, సెప్టెంబర్లో ఐఫోన్ 18 ప్రో మోడళ్లతో పాటు ఇది కూడా వస్తుందని ఔత్సాహికులు ఆశించవచ్చు. కొన్ని నివేదికలు ఈ హ్యాండ్ సెట్ ఐఫోన్ 18 ప్రో మోడళ్లతో పాటే అమ్మకానికి వస్తుందని సూచిస్తుండగా, మరికొన్ని ఆలస్యం కావచ్చని సూచిస్తున్నాయి.
నిక్కీ ఆసియా నివేదిక ప్రకారం, ఆపిల్ కొన్ని తయారీ సమస్యలను ఎదుర్కొంటోంది, దీనివల్ల రవాణా కొన్ని నెలలు ఆలస్యం కావచ్చు. అమ్మకాలు 2027కి వాయిదా పడవచ్చు. ఇదిలా ఉండగా, బ్లూమ్బెర్గ్ ప్రకారం, ఆపిల్ ఈ పరికరాన్ని తన నాన్-ఫోల్డబుల్ మోడళ్లతో పాటు విడుదల చేయడానికి యోచిస్తున్నట్లు తెలిపింది.
ఐఫోన్ ఫోల్డ్ డిజైన్, డిస్ప్లే వివరాలు
టిప్స్టర్ సన్నీ డిక్సన్ షేర్ చేసిన ఒక డమ్మీ ఇమేజ్ ప్రకారం, ఐఫోన్ ఫోల్డ్ అన్ వెయిల్డ్ ఎక్స్ పీరియెన్స్ కు ప్రాధాన్యత ఇస్తుంది. మూసి ఉన్నప్పుడు ఇది కొద్దిగా వెడల్పుగా, చిన్నదిగా కనిపిస్తుంది, తెరిచినప్పుడు ఐప్యాడ్ మినీని పోలి ఉంటుంది. ఈ పరికరంలో 5.5-అంగుళాల బయటి డిస్ప్లే, 7.8-అంగుళాల లోపలి డిస్ప్లే ఉంటాయని, ఈ రెండింటిలోనూ సామ్ సంగ్ M16 OLED ప్యానెల్లను ఉపయోగిస్తారని చెబుతున్నారు.
నివేదికల ప్రకారం, ఆపిల్ ఐఫోన్ ఫోల్డ్లో ఫేస్ ఐడిని వదిలివేసి, దానికి బదులుగా పవర్ బటన్లో టచ్ ఐడి సెన్సార్ను పొందుపరచవచ్చని తెలుస్తోంది. ఇంత సన్నని ఆకృతిలో ఫేస్ ఐడి భాగాలను అమర్చడం కష్టం కాబట్టి, డిజైన్ పరిమితుల కారణంగానే ఈ మార్పు జరుగుతోందని సమాచారం.
కెమెరా స్పెసిఫికేషన్లు
నివేదికల ప్రకారం, ఈ పరికరంలో టెలిఫోటో లెన్స్ లేకుండా, 48-మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్, 48-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని అంచనా. అలాగే, లోపలి స్క్రీన్ కోసం 24-మెగాపిక్సెల్ అండర్-డిస్ప్లే కెమెరా, బయటి డిస్ప్లే కోసం హోల్-పంచ్ కెమెరా కూడా ఇందులో ఉంటాయని చెబుతున్నారు.
Also Read:Mangalavaaram: కొరటాల శివ నిర్మాణంలో ‘మంగళవారం 2’?
నివేదికల ప్రకారం, ఫోల్డబుల్ ఐఫోన్లో ఆపిల్ తదుపరి తరం A20 ప్రో ప్రాసెసర్ ఉంటుంది, ఇది 2nm ప్రాసెస్పై ఆధారపడి ఉంటుందని అంచనా. ఇది ఐఫోన్ 17 ప్రో సిరీస్లోని A19 ప్రోతో పోలిస్తే మెరుగైన పనితీరును, సామర్థ్యాన్ని అందిస్తుంది. ఈ పరికరం 12GB RAM, 1TB వరకు స్టోరేజ్తో రావచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 5,400mAh నుండి 5,800mAh మధ్య ఉంటుందని అంచనా. ఇది కేవలం eSIM సపోర్ట్తో మాత్రమే రావచ్చు, అంటే దీనికి ఫిజికల్ సిమ్ ట్రే ఉండదు.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?