Mangalavaaram: కొరటాల శివ నిర్మాణంలో ‘మంగళవారం 2’?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైవిధ్యమైన సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి. ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆయన, గతేడాది ‘మంగళవారం’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మళ్ళీ తన సత్తా చాటారు. ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్టుకు సీక్వెల్ సిద్ధమవుతోందనే వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం అజయ్ భూపతి, అ ‘శ్రీనివాస మంగాపురం’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అజయ్ భూపతి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘మంగళవారం 2’ లైన్‌ను కొరటాల శివకు వినిపించినట్లు తెలుస్తోంది. అజయ్ చెప్పిన పాయింట్ ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉండటంతో, కొరటాల శివ ఆయన స్నేహితుడు, నిర్మాత మిక్కిలినేని సుధాకర్ ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
‘మంగళవారం’ సినిమా టెక్నికల్‌గా, కంటెంట్ పరంగా ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. ముఖ్యంగా పాయల్ రాజ్‌పుత్ నటన, అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను థ్రిల్ చేశాయి. ఇప్పుడు దానికి సీక్వెల్ అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం. మొదటి పార్ట్ లో మిగిలిపోయిన చిక్కుముడులను విప్పుతూ, మరింత భయంకరమైన సస్పెన్స్ థ్రిల్లర్‌గా పార్ట్-2ను అజయ్ భూపతి ప్లాన్ చేస్తున్నారట. ఈ భారీ సీక్వెల్ కు సంబంధించిన చర్చలు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. అయితే అన్నీ కుదిరితే అతి త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కొరటాల శివ వంటి టాప్ డైరెక్టర్ ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా ఉండటంతో, సినిమా స్కేల్ సహా బడ్జెట్ భారీగా ఉండబోతున్నాయని అర్థమవుతోంది.
Also Read
- Venu Swamy : "నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!"!
- Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
తాజావార్తలు
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!