సోషల్ మీడియా ప్లాట్ ఫారంలలో ఒకటైన వాట్సాప్ ఒకటి.. ఎక్కువ మంది ఈ యాప్ ను వాడుతున్నారు. దాంతో జనాల్లో డిమాండ్ కూడా బాగా పెరిగింది..ఫోటోలు, వీడియోలు పంపడంతో పాటు వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు..ఇక వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను అందిస్తుంది.. తాజాగా మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తుంది.. తాజాగా మరో ఫీచర్ ను కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చింది..వాట్సాప్‌లో ఎలాంటి ఫోటోలు పంపినా.. లేదా ఏవైనా ఫోటోలను డౌన్ లోడ్ చేసుకున్నా.. అవి క్లారిటీ లేకుండా ఉండేవి. ఎందుకంటే హై క్వాలిటీ ఫోటోలను వాట్సాప్ సపోర్ట్ చేసేది కాదు. అదే విధంగా హై క్వాలిటీ ఫోటోలను, వీడియోలను ఆటోమేటిక్‌గా కంప్రెస్ చేసేంది.అందుకే ఫోటోలు అంతగా బాగుండవు.. అయితే తాజాగా వచ్చిన ఫీచర్ ద్వారా ఆ సమస్య దూరం అయినట్లే..
అతి త్వరలో వచ్చే కొత్త ఫీచర్‌తో వాట్సాప్ నుంచి హెచ్‌డి ఫోటోలను పంపుకోవచ్చు. ముందుగా ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లలో కొందరు బీటా వర్షన్ వారికి ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది..ఈ ఫీచర్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. వాట్సాప్‌లో హెచ్‌డి ఫోటోలు పంపాలనుకునే ఆండ్రాయిడ్ యూజర్లు 2.23.12.13 వాట్సాప్ బీటా, IOS యూజర్లు 23.11.0.76 వాట్సాప్ బీటా ఫీచర్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ఈ లేటెస్ట్ ఫీచర్ త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది..
ఇకపోతే ఫీచర్లో లిమిటెడ్ ఫోటోలను మాత్రమే పంపుకోవాల్సి ఉంటుంది. ఈ ఫోటోల ఇన్ చాట్ షేరింగుకు మాత్రమే పరిమితం చేసినట్లు వాట్సాప్ ప్రకటించింది. ఈ కొత్త ఫీచర్ వీడియోలకు, స్టేట వర్తించదని తెలిపింది.. ఇది కేవలం ఫొటోస్ కు మాత్రమే వర్తిస్తుంది.. ఇక త్వరలోనే మరో కొత్త ఫీచర్ ను డెవలప్ చెయ్యనున్నారు..ఇటీవలే వాట్సాప్ ‘స్క్రీన్ షేరింగ్’ ఫీచర్‌ను రిలీజ్ చేసింది. ఈ ఆప్షన్ ఆండ్రాయిడ్ బీటా టెస్ట్ యూజర్లకు అందుబాటులో ఉంది. వీటితో పాటు త్వరలో ‘వాట్సాప్ యూజర్ నేమ్స్’ అనే ఫీచర్‌ను కూడా తీసుకురానుంది.. మొత్తానికి వాట్సాప్ లో ఫ్యూచర్ లో రానున్న ఫీచర్స్ జనాలను ఏ విధంగా ఆకట్టుకుంటాయో చూడాలి..