WhatsApp New Feature : వాట్సాప్ అదిరిపోయే ఫీచర్.. ఫోటో బ్లర్ చేసుకునే ఆప్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WhatsApp New Feature : సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ కొత్త ఫీచర్లతో దూసుకుపోతోంది. ఇటీవల అనేక కొత్త ఫీచర్లను యూజర్లకు అందిస్తూ తన మార్కెట్ మరింత పెంచుకుంటుంది. ఈ క్రమంలో డెస్క్ టాప్ యూజర్ల కోసం కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఫోటో బ్లర్ చేసే సదుపాయం కల్పించింది. ప్రస్తుతం ఈ అవకాశం ఇప్పటి వరకు బీటా యూజర్లకు అందుబాటులోకే తెచ్చింది. త్వరలోనే అందరికి ఈ ఫీచర్ అవకాశం కల్పించనుంది. ఇంతకు ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందంటే.. వాట్సాప్ బీటా ట్రాకర్ డబ్ల్యూ బీటా ఇన్ఫో ఈ ఇమేజ్ బ్లర్ టూల్ గురించి వెల్లడించింది. మరింత సెక్యూర్‌గా ఇమేజ్‌లు షేర్ చేసుకునేందుకు ఈ బ్లర్ టూల్ ఉపయోగపడుతుంది. ఫొటోను సెండ్ చేసే ముందు.. ఆ ఫొటోలోని ఏదైనా భాగాన్ని ఈ టూల్ సాయంతో బ్లర్ చేసే అవకాశం ఉంటుంది. అంటే రిసీవర్‌కు ఫొటోలోని ఏదైనా భాగం కనిపించకూడదనుకుంటే.. దాన్ని బ్లర్ చేసి పంపించే సదుపాయం ఈ టూల్ వల్ల వస్తుంది. త్వరలోనే ఇమేజ్ బ్లర్ ఫీచర్‌ను మొబైల్ బీటా వెర్షన్‌కు కూడా తెచ్చే అవకాశం ఉంది. టెస్టింగ్ పూర్తయ్యాక యూజర్లందరికీ ఈ బ్లర్ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. గ్రూప్‌ల నుంచి నిష్క్రమించడం, ఆన్‌లైన్ యాక్టివ్ స్టేటస్‌ను హైడ్ చేసుకోవడం, వ్యూవన్స్ మెసేజ్‌లకు స్క్రీన్‌షాట్స్‌ను బ్లాక్ చేయడం వంటి ఫీచర్లను కూడా త్వరలో వాట్సాప్ తీసుకురానుంది. మరోవైపు వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా 2.22.23.15 వెర్షన్‌తో ఓ కొత్త ఫీచర్‌ను అందిస్తోంది. మీడియాను క్యాప్షన్‌తో ఫార్వర్డ్ చేసుకునే సదుపాయాన్ని ఇస్తోంది. మరోవైపు యూజర్లందరూ ఎదురుచూస్తున్న ఎడిట్ మేసేజ్ ఫీచర్‌పై వాట్సాప్ పని చేస్తోంది. మెసేజ్ సెండ్ చేసిన తర్వాత కూడా ఎడిట్ చేసుకునే సదుపాయాన్ని ఇచ్చే ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!