NTV Telugu Site icon

WhatsApp Update: డాక్యుమెంట్ స్కాన్ ఫీచర్ అందుబాటులోకి తీసుకరాబోతున్న వాట్సాప్

Whatsapp

Whatsapp

WhatsApp Document scanning Update: వాట్సాప్ మేసేజింగ్ ప్లాట్‌ఫామ్ తన వినియోగదారులకు కొత్త ఆప్షన్స్ ని అందించేందుకు తరచూ కొత్త అప్డేట్స్ ను పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగానే, “డాక్యుమెంట్ స్కాన్” అనే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ తీసుకరావడం ప్రారంభించింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఫోన్ కెమెరా సహాయంతో డాక్యుమెంట్స్‌ను నేరుగా స్కాన్ చేసి వాటిని తేలికగా షేర్ చేయవచ్చు. ముఖ్యంగా తరచూ డాక్యుమెంట్స్‌ను స్కాన్ చేయాల్సిన లేదా పంపాల్సిన వారికి ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది.

Also Read: Rohit Sharma: కెప్టెన్‌ కావడం వల్లే రోహిత్ ఇంకా ఆడుతున్నాడు: ఇర్ఫాన్

ఈ ఫీచర్, వాట్సాప్ డాక్యుమెంట్ షేరింగ్ మెనూలో భాగంగా అందుబాటులో ఉంది. ఇది యూజర్లకు ఫోన్ కెమెరా ద్వారా ఫిజికల్ డాక్యుమెంట్స్‌ను నేరుగా స్కాన్ చేసి పంపించే సౌలభ్యం కల్పిస్తుంది. ఇప్పటి వరకు, డాక్యుమెంట్ ఫోటో తీసి, దానిని డాక్యుమెంట్ ఫార్మాట్‌లో మార్చి పంపాల్సి వచ్చేది. ఇది చాలా సమయం తీసుకోవడం తోపాటు ఫోటో నాణ్యత కూడా అంత బాగుండేది కాదు. కానీ ఇప్పుడు ఈ కొత్త ఫీచర్‌తో డాక్యుమెంట్స్‌ను నేరుగా స్కాన్ చేసి పంపడం ద్వారా సమయం కూడా ఆదా అవుతుంది. ఇంకా మరియు డాక్యుమెంట్ నాణ్యత మెరుగ్గానే ఉంటుంది.

ఈ ఫీచర్‌ను ఉపయోగించడం చాలా సులభం. క్రింది స్టెప్స్‌ని పాటించి మీరు సులభంగా డాక్యుమెంట్ స్కాన్ చేయవచ్చు:
* వాట్సాప్ ఓపెన్ చేసి, మీరు డాక్యుమెంట్ పంపాలనుకుంటున్న చాట్ లేదా గ్రూప్‌ను సెలెక్ట్ చేసుకోండి.
* అటాచ్‌మెంట్ ఐకాన్ పై టాప్ చేయండి.
* అక్కడ కనిపించే “డాక్యుమెంట్” ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
* ఇప్పుడు “స్కాన్” ఆప్షన్‌పై టాప్ చేయండి.
* మీ కెమెరా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు స్కాన్ చేయాల్సిన డాక్యుమెంట్ ఫోటో తీసుకోండి.
* ఫోటో తీసుకున్న తర్వాత, మీరు స్కాన్‌ను చూడవచ్చు. కావాలనుకుంటే అంచులను సరిదిద్దుకోవచ్చు.
* అన్ని సరిగా అనిపించిన తర్వాత, “కన్ఫర్మ్” పై టాప్ చేయండి.
* స్కాన్ చేసిన డాక్యుమెంట్ ఇప్పుడు పంపేందుకు సిద్ధంగా ఉంటుంది. “సెండ్” బటన్ పై టాప్ చేసి పంపించుకోవచ్చు.

Also Read: PSLV-c60: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ-సీ 60.. నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహాలు!

ఈ కొత్త ఫీచర్‌తో, ఫోటో తీసి దానిని క్రాప్ చేయాల్సిన అవసరం ఉండదు. నేరుగా స్కాన్ చేసి పంపించవచ్చు. పైగా, స్కాన్ చేసిన డాక్యుమెంట్ నాణ్యత ఫోటోతో పోల్చితే చాలా మెరుగ్గా ఉంటుంది. వాట్సాప్ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేవడంతో యూజర్లకు మరింత సౌలభ్యం కల్పించింది. తరచూ డాక్యుమెంట్స్ స్కాన్ చేయాల్సిన వారికి ఈ ఫీచర్ ఒక గొప్ప ఉపయుక్తమైన పరిష్కారం అవుతుంది.

Show comments