WhatsApp : భారత్ లో 47 లక్షల వాట్సాప్ అకౌంట్స్ బ్యాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మెటా యాజమాన్యంలోని ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్పాప్ మార్చి 2023 నెలకి యూజర్ సేప్టీ రిపోర్ట్ ను లాంచ్ చేసింది. ఈ ప్లాట్ ఫారమ్ ద్వారా నిషేధించిన భారతీయ వాట్సాప్ అకౌంట్ల సంఖ్య.. యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం.. మార్చ్ 2023లో భారతీయులకు చెందిన 47 లక్షలకు పైగా వాట్సాప్ అకౌంట్లను నిషేధానికి గురయ్యాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్ 4( 1)(D)కి ప్రకారం ఈ అకౌంట్లపై వాట్సాప్ నిషేదం విధించింది.
Also Read : Adipurush: గ్రాండ్గా ‘ఆదిపురుష్’ ట్రైలర్ ఈవెంట్!
Also Read
వాట్సాప్ యూజర్లు భారతీయ చట్టాలను లేదా వాట్సాప్ సర్వీసుల నిబంధనలను ఉల్లంఘించినందున బ్యాన్ చేసినట్లు తెలిపారు. మార్చ్ 1 నుంచి 31వ తారీఖు వరకు 4,715,906 మంది భారతీయ వాట్సాప్ యూజర్లను నిషేదించింది. ఇందులో దాదాపు 1,659,385 అకౌంట్లను యూజర్ల నుంచి ఫిర్యాదులు అందక ముందే వాట్సాప్ నిషేదించింది. ఈ ప్లాట్ ఫారమ్ నివారణ, గుర్తింపు పద్దతులతో మిగిలిన వాట్సాప్ అకౌంట్లపై చర్యలు తీసుకున్నారు.
Also Read : Akhil: పూజతో డేట్… చరణ్ నా హార్ట్ బీట్… పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లో ఏజెంట్
మార్చ్ లో వాట్సాప్.. గత నెలతో పోలీస్ట్ అనేక అకౌంట్లను నిషేదించింది. 2023లో జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28మధ్య 4,597,400 మంది భారతీయ వాట్సాప్ యూజర్లను ప్లాట్ ఫారంపై బ్యాన్ చేసింది. ఇందులో దాదాపు 1,298,000 అకౌంట్లను యూజర్ల నుంచి కంప్లైంట్ ఇవ్వక ముందే నిసేదించింది. అదనంగా వాట్సాప్ కు 4,720 ఫిర్యాదులు నివేదికలు అందాయని లేటెస్ట్ రిపోర్టు వెల్లడించింది. వీటిలో 4,316 బ్యాప్ అప్పీళ్లు రాగా.. వాట్సాప్ 553 అకౌంట్లపై మాత్రమే చర్యలు తీసుకుంది. వాట్సాప్ ప్లాట్ ఫారమ్ కు భద్రతకు సంబంధించిన 10 రిపోర్టులు కూడా అందాయి. అయితే వాట్సాప్ ఏ అకౌంట్ పైనా చర్యలు తీసుకోలేదు.
Also Read : Quad Summit 2023: చైనాకు చెక్ పెట్టేలా క్వాడ్ మీటింగ్
కొన్ని రిపోర్టుల ప్రకారం.. వాట్సాప్ యూజర్ల అకౌంట్లను రివ్యూ చేసిన తర్వాత కంపెనీ బ్లాక్ చేయలేదు.. ఎందుకంటే.. వాట్సాప్ యూజర్లు తమ అకౌంట్లను యాక్సెస్ చేయడానికి.. ఏదైనా ఫీచర్ ను ఉపయోగించడానికి అభిప్రాయాన్ని అందించడానికి హెల్ప్ కావాలి.. రిపోర్టు చేసిన అకౌంట్లలో ఏ అకౌంట్ కూడా భారతీయ చట్టాలను లేదా కంపెనీ సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించలేదు.. వినియోగదారుల ప్రైవసీని సురక్షితంగా ఉంచడానికి ఏఐతో డేటా సైంటిస్టులు, నిపుణులతో ఎప్పటికప్పుడూ సమీక్షిస్తుంటామని వాట్సాప్ స్పష్టం చేసింది.
Also Read : Gun Culture : గన్ ఇవ్వండి.. గిఫ్ట్ కార్డు తీసుకోండి..!
ఐటీ రూల్స్ 2021 ప్రకారం.. మార్చ్ 2023లో వాట్సాప్ తమ రిపోర్టును బహిర్గతం చేసింది. ఈ వినియోగదారు. భద్రతా నివేదికలో స్వీకరించిన యూజర్ల ఫిర్యాదులు, వాట్సాప్ ద్వారా అందుకున్న సంబంధిత చర్యల వివరాలు.. ప్లాట్ ఫారమ్ లో దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి వాట్సాప్ సొంత నివారణ చర్యలను చేపడుతుంది. లేటెస్ట్ రిపోర్ట్ ప్రాకారం వాట్సాప్ మార్చ్ నెలలో 4.7 మిలియన్లకు పైగా అకౌంట్లను నిషేందించిందని వాట్సాప్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
తాజావార్తలు
-
India Job Crisis: ఇంజనీరింగ్ చేసి స్వీపర్ పోస్టులకు అప్లై చేస్తున్నారు.. ఇక డిగ్రీలు దండగేనా?
-
POK killings: పీఓకేలో పాక్ హత్యాకాండ.. 30 మంది బ్రిటిష్ ఎంపీల ఆందోళన..
-
Ponguleti Srinivas Reddy : గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు
-
Tech News: మనల్ని మింగేసే రాక్షసి..! బాంబు పేల్చిన ‘క్లాడ్’
-
Abhai Naveen : కథ పట్టుకెళ్తే గ్లామర్ కావాలంటారు.. హీరోయిన్ల గుట్టు విప్పిన బిగ్ బాస్ అభయ్ నవీన్!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!