అక్కినేని అఖిల్ భారి ఆశలతో చేసిన ఏజెంట్ సినిమా, ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య ఏప్రిల్ 28న రిలీజ్ అయ్యింది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ స్పై యాక్షన్ సినిమా ఊహించని విధంగా నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ డే ఈవెనింగ్ షోకే థియేటర్స్ కాలీ అయిపోవడంతో అఖిల్ కెరీర్ లో మాత్రమే కాదు టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా ఏజెంట్ సినిమా నిలిచింది. రిలీజ్ అయ్యి మూడు రోజులు మాత్రమే అయ్యింది, థియేటర్స్ లో అక్కడక్కడా ఇంకా సినిమా ఆడుతూ ఉంది. ఇలాంటి సమయంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ నుంచి ‘బౌండ్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ కి వెళ్లాం, తప్పు జరిగింది’ అంటూ షాకింగ్ స్టేట్మెంట్ బయటకి వచ్చింది. దర్శకుడి ట్రాక్ రికార్డ్ చూసి, అతన్ని నమ్మి ఏజెంట్ సినిమా కోసం అఖిల్ పడిన కష్టం తెరపైన కనిపిస్తుంది. ఏజెంట్ రిజల్ట్ చూసిన తర్వాత ఇక ఇప్పట్లో మళ్లీ అఖిల్ బయట కనిపించడు అనుకున్నారు అందరూ కానీ అఖిల్, హీరోయిన్ సాక్షి కలిసి యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్న షోకి గెస్టులుగా వచ్చిన ప్రోమో రిలీజ్ అయ్యింది.
మే 6న ఏజెంట్ స్పెషల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుండడంతో ఇది పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ప్రోగ్రామా అనే సందేహం అందరిలోనూ ఉంది. అయితే ఇది ఏజెంట్ సినిమా రిలీజ్ కన్నా ముందు షూట్ చేసిన ఈవెంట్, ఇప్పుడు టెలికాస్ట్ చేస్తున్నారు అంతే. ఈ ప్రోమోలో అఖిల్ చాలా జోష్ లో కనిపిస్తున్నాడు. సుమపై కూడా పంచులు వేస్తూ పాజిటివ్ వైబ్ లో ఉన్నాడు. “ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు” అనే డైలాగ్ చెప్పి అఖిల్, షోలో ఉన్న అందరికీ తన ఎనర్జీని పాస్ చేశాడు. పూజా హెగ్డేతో డేటింగ్ కి వెళ్లాలనుందని, రామ్ చరణ్ నా ఫేవరేట్ హీరో-నా హార్ట్ బీట్ అని అఖిల్ చెప్పడం విశేషం. ప్రస్తుతం ఈ ప్రోమో యుట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది.