1. నేటి నుంచి ఎంబీబీఎస్ తొలి విడత ప్రవేశాలు. కన్వీనర్ కోటా సీట్లకు కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్. నేడు, రేపు తొలివిడత వెబ్ ఆప్షన్లకు అవకాశం.
2. నేడు టీ20 వరల్డ్ కప్‌లో నేటి మ్యాచ్‌లు. ఉదయం 8.30 గంటలకు బంగ్లాదేశ్‌తో జింబాబ్వే మ్యాచ్. మధ్యాహ్నం 12.30 గంటలకు పాకిస్తాన్‌తో నెదర్లాండ్ మ్యాచ్. సాయంత్రం 4 గంటలకు దక్షిణాఫ్రికాతో తలపడనున్న భారత్.
3. నేటి హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,750 లుగా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,000 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.63,000 లుగా ఉంది.
4. నేడు చండూరులో సీఎం కేసీఆర్ బహిరంగ సభ. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభంకానున్న బహిరంగ సభ.
5. తెలంగాణలో ఐదవ రోజు రాహుల్ భారత్ జోడో యాత్ర. నేడు జడ్చర్ల సమీపంలోని గొల్లపల్లి నుంచి ప్రారంభం. షాద్‌నగర్ మండలం సోలిపూర్ జంక్షన్ వరకు యాత్ర. బాలానగర్ మండలంలోని పెద్దాయిపల్లిలో లంచ్ బ్రేక్. నేడు 22 కిలోమీటర్ల పాటు రాహుల్‌గాంధీ పాదయాత్ర.