Whats Today updates 14.10.2022
1. నేడు 33వ రోజు అమరావతి రైతుల పాదయాత్ర. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో యాత్ర. మునిపల్లె నుంచి ముప్పవరం వరకు పాదయాత్ర.
2. నేడు ఏపీలో ప్రవేశించనున్న రాహుల్ జోడో యాత్ర. అనంతపురం జిల్లా డి.హిరేహాల్‌లో రాహుల్ పాదయాత్ర.
3. తెలంగాణలో నేడు, రేపు పలు చోట్ల భారీ వర్షాలు. కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.
4. నేటి నుంచి రోడ్‌కం రైల్వే బ్రిడ్జిపై రాకపోకలు బంద్. వారం రోజులపాటు మరమ్మతులు చేయనున్న అధికారులు. గామన్ వంతెన మీదుగా లారీలు, భారీ వాహనాలు. బ్యారేజ్ మీదుగా బైకులు, కార్లు, బస్సులు మళ్లింపు.
5. నేడు వైస్సార్ జీవిత సాఫల్య పురస్కారాల ప్రకటన. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అవార్డులు. 25 మంది వ్యక్తులు, సంస్థలతో జాబితా సిద్ధం. జగన్ చేతుల మీదుగా నవంబర్ 1న అవార్డుల ప్రదానం.
6. నేడు ఏపీ పీజీ సెట్ ఫలితాలు. సాయంత్రం 4 గంటలకు ఫలితాలు విడుదల.
7. అండర్-17 మహిళల పుట్‌బాల్ ప్రపంచకప్. నేడు మొరాకోతో భారత్ ఢీ. రాత్రి 8గంటలకు మ్యాచ్ ప్రారంభం.
8. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.46,750 లుగా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.51,000 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.62,500 లుగా ఉంది.
9. నేడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్. చండూరులో నామినేషన్ వేయనున్న పాల్వాయి స్రవంతి.