NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today On September 19th 2023: నేడు కర్నూల్, నంద్యాల జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. లక్కసాగరంలో హంద్రీనీవా ఎత్తిపోతలను సీఎం ప్రారంభిస్తారు. తాగు, సాగునీరు అందించే పథకాలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. నంద్యాల జిల్లా డోన్‌లో బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు.

టీడీపీ అధినేత నారా చంద్రబాబు రిమాండ్ పదో రోజుకు చేరుకుంది. నేడు చంద్రబాబుతో టీడీపీ లీగల్ సెల్ లాయర్ల ములాఖత్ ఉంది.

ఈరోజు ఏపీ హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు పిటిషన్లపై విచారణ జరగనుంది. ఏపీ హైకోర్టులో క్వాష్, రిమాండ్ రివ్యూ పిటిషన్లపై విచారణ ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్ విచారణ జరగనుంది.

నేడు రెండో రోజు ప్రత్యేక పార్లమెంట్ సమావేశం జరగనుంది. ఉదయం 9.30 గంటలకు ఫోటో సెషన్ ఉంటుంది. 11 గంటలకు సెంట్రల్ హాల్ లో ఎంపీల సమావేశం జరుగుతుంది. నేడు ఎంపీలతో కలిసి కొత్త పార్లమెంట్ భవనంలోకి ప్రధాని మోడీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈరోజు ఎంపీలకు గిఫ్ట్ బ్యాగ్ ఇవ్వనున్నారు.

నేడు పాత భవనంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరగనుంది. ఓం బిర్లా నేతృత్వంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఉంటుంది.

Also Read: Vijay Antony Daughter: బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్య!

నేడు మధ్యాహ్నం 1.15కు లోక్‌సభ, మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ సమావేశం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు స్పీకర్ ‘బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం’ ఉంది.

శ్రీశైలంలో నేడు గణేష్ సదన్, పంచమఠాల ప్రారంభోత్సవం జరగనుంది. ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనులను భూమిపూజ జరగనుంది.