Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

ఇవాళ కర్నూలులో సీఎం చంద్రబాబు పర్యటన.. సీ క్యాంప్ రైతు బజార్‌లో రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడనున్న సీఎం

నేడు కాకినాడ టీడీపీ కార్యాలయంలో జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు, ఇంఛార్జిల సమావేశం.. మినీ మహానాడు నిర్వహణపై చర్చించనున్న నేతలు

మంత్రాలయం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నేడు స్వామి వారికి తులసి అర్చన, కనకాభిషేకం, పాలాభిషేకం, పంచామృతభిషేకం వంటి ప్రత్యేక పూజలు.. సాయంత్రం స్వామి వారిని రథంపై ఊరేగింపు

నేడు‌ గుంటూరు జిల్లా బొంగరాలబీడు స్మశానవాటికలో ఎలక్ట్రికల్‌ క్రెమోషన్ సెంటర్ ప్రారంభించనున్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

నేడు గుంటూరులో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన‌ సందర్భంగా తిరంగా ర్యాలీ.. హిందూ కాలేజీ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకూ జాతీయ జెండాలతో ర్యాలీ

ఇవాళ జేఎన్టీయూ 14వ స్నాతకోత్సవం.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న గవర్నర్ అబ్దుల్ నజీర్.. 41 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్

అనంతపురం నగరంలో తిరంగా ర్యాలీ కార్యక్రమం.. హాజరుకానున్న మంత్రి కేశవ్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, జిల్లా అధికారులు.. ఆర్ట్స్ కళాశాల నుంచి టవర్ క్లాక్ మీదుగా సప్తగిరి సర్కిల్ వరకు కొనసాగునున్న తిరంగా ర్యాలీ

ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న మంత్రి నారా లోకేష్.. సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం

నేడు విశాఖలో అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం.. ఈనెల 20న తలపెట్టిన స్టీల్ ప్లాంట్ సమ్మె విజయవంతంపై ప్రధానంగా చర్చించనున్న జేఏసీ

జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన.. బుగ్గారం మండలంలో భూభారతి కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి

నేడు సంగారెడ్డి, మెదక్ జిల్లాలో మంత్రులు పొంగులేటి, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖల పర్యటన.. మెదక్ జిల్లా చిలిపిచెడ్, సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీ రఘురామ రెడ్డి

నేడు వరంగల్ రైల్వే స్టేషన్‌ను సందర్శించనున్న దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్.. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ స్కీమ్ లో భాగంగా 25.41 కోట్లతో ఆధునికరించిన వరంగల్ రైల్వే స్టేషన్‌ను సందర్శించనున్న జీఎం అరుణ్ కుమార్ జైన్

నేటి నుంచే ఐపీఎల్‌ 2025 పునః ప్రారంభం.. చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30కు బెంగళూరు, కోల్‌కతా మధ్య మ్యాచ్

 

Exit mobile version