Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* ఐపీఎల్‌: నేడు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) వర్సెస్ గుజరాత్‌ టైటాన్స్‌ (GT).. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌

* ఢిల్లీ: నేడు కేంద్ర కేబినెట్‌ సమావేశం.. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు భేటీ.. పశ్చిమాసియాలో నెలకొన్న సంఘర్షణ పరిస్థితులు, భారత్‌పై ప్రభావం.. గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరా అంశాలపై చర్చ.. అభివృద్ధి అంశాలపై నిర్ణయం తీసుకోనున్న కేంద్రం

* విశాఖలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన.. ఆంధ్రా యూనివర్సిటీలో కొద్ది గంటల పాటు ఉండనున్న పవన్.. ​ “శతాబ్ది మహోత్సవ్ – ఏయూ మెగా కల్చరల్ ఫెస్ట్ 2026” వేడుకల్లో ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం

* అమరావతి : ఇవాళ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలతో పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశం.. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆ నియోజకవర్గ వైసీపీ స్ధానిక సంస్ధల మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో జగన్‌ భేటీ.. పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్న జగన్.. ఇటీవల వరుసగా పలు నియోజకవర్గాల పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న జగన్..

* తిరుమల: 6 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 74,232 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 23,288 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.38 కోట్లు

* విశాఖ: మంత్రి వాసంశెట్టి సుభాష్ రెండు రోజుల ఉత్తరాంధ్ర పర్యటన.. విశాఖలో పరిశ్రమలను సందర్శించనున్న మంత్రి

* హైదరాబాద్‌: పీసీ ఘోష్ రిపోర్ట్‌పై నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు.. కాళేశ్వరం కమిషన్‌ను సవాల్‌ చేసిన కేసీఆర్‌, హరీష్‌రావు

Exit mobile version