NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సత్యాగ్రహ దీక్ష చేయనున్నారు. గాంధీ జయంతిని పురస్కారించుకుని స్కిల్ స్కామ్ అక్రమ అరెస్టులో న్యాయం కోరుతూ దీక్ష చేయనున్నారు. సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబు అరెస్టయిన విషయం తెలిసిందే.

ఈరోజు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి ‘సత్యమేవ జయతే’ పేరుతో నిరహార దీక్ష చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ ఏరియాలో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో భువనేశ్వరి నిరసన దీక్ష చేయనున్నారు.

ఈరోజు మచిలీపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి యాత్ర’ సాగనుంది. మచిలీపట్నంలో మహాత్మా గాంధీకి పవన్ నివాళులర్పించనున్నారు. ఆపై కృష్ణాజిల్లా కార్యవర్గంతో పవన్ భేటీ కానున్నారు.

నేడు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో మూడో విడత డబుల్ బెడ్ రూంలను లబ్ధిదారులకు మంత్రి అందజేయనున్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో నూతన రెవెన్యూ డివిజన్ కార్యాలయం ప్రారంభోత్సవం చేస్తారు. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారు.

Also Read: Meenakshi Chaudhary: బంఫర్ ఆఫర్ కొట్టేసిన మీనాక్షి.. ఆ హీరో సినిమాలో ఛాన్స్..

మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నేడు మెదక్ వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత తొలిసారిగా మెదక్ నియోజకవర్గంలో మైనంపల్లి, ఆయన కుమారుడు రోహిత్ పర్యటించనున్నారు. మెదక్‌లో సర్వమత ప్రార్థనల్లో మైనంపల్లి పాల్గొననున్నారు.

ప్రపంచకప్‌ 2023లో భాగంగా నేడు రెండు వార్మప్ మ్యాచులు జరగనున్నాయి. గుహవాటి వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు ఇంగ్లండ్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ ఉంది. న్యూజిలాండ్ vs సౌతాఫ్రికా మధ్య తిరువనంతపురంలో మరో మ్యాచ్ ఉంది.

Show comments