NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today New

Whats Today New

దేశంలో మండుతున్న ఎండలు.. రాజస్థాన్‌ ఫలోడిలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.. దేశంలో ఈ ఏడాది ఇదే అత్యధిక ఉష్ణోగ్రత.. బర్మర్‌లో 48.8, జైసల్మీర్‌లో 48 డిగ్రీల ఉష్ణోగ్రత.

నేడు యూపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం.

బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘రేమాల్’ తుఫాన్‌.. ఇవాళ తీవ్ర తుఫాన్‌గా మారి  అర్ధరాత్రి తర్వాత తీరం దాటే అవకాశం.. తీరం దాటే సమయంలో గంటకు 90-110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్.. ఒడిశా, పశ్చిమబెంగాల్‌, బంగ్లాదేశ్‌లో అధికంగా రేమాల్ తుఫాను ప్రభావం.. ఏపీపై పెద్దగా ప్రభావం లేదంటున్న విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం.. ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న రేమాల్ తుఫాన్.

నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు 1.91 లక్షల మంది దరఖాస్తు.. ఏపీలో 26, తెలంగాణలో 13 పరీక్ష కేంద్రాలు.. ఉదయం మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి నిరాకరణ.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం..

నేడు ఐపీఎల్‌ 2024 ఫైనల్ మ్యాచ్.. ఫైనల్‌లో కోల్‌కతాతో తలపడనున్న హైదరాబాద్.. చెన్నై వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,440… 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,400.. తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండి ధర రూ. 96,000.