NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

*హైదరాబాద్: నేడు గ్రూప్‌-1 అభ్యర్థుల డిమాండ్లపై సమగ్ర ప్రకటన చేయనున్న ప్రభుత్వం.. అభ్యర్థులు నష్టపోకుండా తీసుకునే చర్యలపై చర్చించిన మంత్రులు.

*హైదరాబాద్‌: నేడు కేబీఆర్ పార్క్ దగ్గర ప్రజా సంబరాలు.. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ప్రజా సంబరాలు.. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు సంబరాలు.

*నేడు వారణాసిలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.6,100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని.. ఆర్‌జే శంకర కంటి ఆస్పత్రిని ప్రారంభించనున్న ప్రధాని మోడీ.

*తిరుమల: ఆన్‌లైన్‌లో జనవరి నెల ఆర్జిత సేవా టికెట్లు విడుదల.. లక్కీడిప్ విధానంలో ఆర్జిత సేవా టికెట్లు కేటాయింపు.. రేపు ఉదయం 10 గంటల వరకు లక్కీడిప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం.. రేపు మధ్యాహ్నం 2 గంటలకు లక్కీడిప్ విధానంలో ఆర్జిత సేవా టికెట్లు కేటాయింపు.

*తిరుమల: 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 80,741 మంది భక్తులు.

*నేడు మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్.. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనున్న న్యూజిలాండ్.. దుబాయ్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్.

*తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,800.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,420.. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.1,07,000.