నేడు బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. 12వ సార్వత్రిక ఎన్నికల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలను భారత్‌కు చెందిన ముగ్గురు సహా 100 మందికి పైగా విదేశీ పరిశీలకులు పర్యవేక్షించనున్నారు. ఈ ఎన్నికల్లో 27 పార్టీలకు చెందిన 1,500 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. షేక్ హసీనా నేతృత్వంలోని ఆవామీ లీగ్ పార్టీ పోటీ చేస్తుండగా.. బంగ్లా నేషనలిస్ట్ పార్టీ ఎన్నికలను బహిష్కరించింది.
నేడు తిరువూరు, అచంటలో టీడీపీ ‘రా కదిలిరా’ బహిరంగ సభలు జరగనున్నాయి. ఈ సభలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. టీడీపీ ఎంపీ కేశినేని నానీ మాత్రం దూరంగా ఉండనున్నారు.
నేడు ఏపీ బ్రాహ్మణ ఐక్యవేదిక సమావేశం జరగనుంది. 2024 ఎన్నికల్లో బ్రాహ్మణులకి టికెట్ల కేటాయింపుపై సమావేశం జరగనుంది.
హిందూపురంలో నేటి నుంచి మూడు రోజులు ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించనున్నారు. మున్సిపాలిటీ , రూరల్ కార్యకర్తలతో అంతర్గత సమావేశాలు బాలకృష్ణ నిర్వహించనున్నారు.
నేడు మంగళగిరిలో నారా లోకేష్ పర్యటించనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయాలను సందర్శించనున్నారు. మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయ మెట్ల పూజలో ఆయన పాల్గొంటారు.
నేడు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పర్యటించనున్నారు. ఉదయం వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భట్టి పాల్గొంటారు. అక్కడి నుంచి ఖమ్మం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు ప్రజాభవన్ కు చేరుకుంటారు.
Also Read: Today Gold Price: మగువలకు శుభవార్త.. నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా ఆదివారం రాత్రి 8 గంటలకు పూణేతో తలైవాస్ తలపడనుంది. రాత్రి 9 గంటలకు హర్యానాలో బెంగాల్ ఢీ కొట్టనుంది.
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు భారత్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. ముంబైలో రా.7 గంటల నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ పట్టేయాలని హర్మన్‌ప్రీత్ బృందం పట్టుదలగా ఉంది. వన్డే సిరీస్‌లో వైట్‌వాష్ అయినా తొలి టీ20లో భారత్ గొప్పగా పుంజుకుంది.
