* ఐపీఎల్‌లో నేడు రాత్రి 7.30 గంటలకు ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్-కోల్‌కతా మధ్య మ్యాచ్
* ఢిల్లీలో నేడు బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.. ధ్యాహ్నం 1:05 గంటలకు వసంత్ విహార్‌లో నిర్మించిన బీఆర్‌ఎస్ జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవం..
* ప్రకాశం : మార్కాపురం లోని కపిలగిరి యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి జయంతి సందర్భంగా చందనోత్సవం, చందన సేవ, నరసింహ స్వామి కళ్యాణం..
* ప్రకాశం : గిద్దలూరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు తిరునాళ్ల మహోత్సవం, రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు.. భారీగా హాజరుకానున్న భక్తులు..
* తిరుమల: ఇవాళ శ్రీవారి ఆలయంలో నృశింహ జయంతి వేడుకలు.. నృశింహ స్వామి ఆలయంలో ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించనున్న అర్చకులు
* తిరుమల: రేపు పౌర్ణమి గరుడ సేవ.. రేపు రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి
* బాపట్ల జిల్లా పెరవలి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగర్జున…
* నేడు, రేపు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో టిడిపి అధినేత చంద్రబాబు పర్యటన.. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్న చంద్రబాబు
నాయుడు
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మనుబోలు గూడూరులో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
* నెల్లూరు: ఆత్మకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో జాబ్ మేళా.
* కాకినాడలో బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ముగింపు ఉత్సవాలు.. పాల్గొనున్న బీజేపీ జాతీయ కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి.
* శ్రీకాకుళం: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 5వ వార్డు నీలాపురం, ఉప్పరపేట గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి సీదిరి అప్పలరాజు
* తిరుపతి: నేటి నుంచి మూడు రోజుల పాటు పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు
* నేడు నారా లోకేష్ 89వ రోజు పాదయాత్ర.. రేమండూరు, పుసులూరు, బొల్లవరం, బస్తిపాడు, చిన్నకొట్టాల, పెద్దకొట్టాల లో కొనసాగనున్న పాదయాత్ర
* అనంతపురం : కళ్యాణదుర్గం పట్టణంలో సచివాలయ కన్వీనర్లు, గృహసారథుల సమావేశం. పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్.
* శ్రీ సత్యసాయి : లేపాక్షి లో నేడు వీరశైవలింగా యత్ సంఘం ఆధ్వర్యంలో బసవ జయంతి వేడుకలు.
* కర్నూలు: నేడు మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో నేడు స్వామి వారి మూలబృందావనంకు తుంగభద్ర జలంతో అభిషేకం, తులసి అర్చన, కనకాభిషేకం, పంచామృతభిషకం వంటి విషేశ పూజలు.. సాయంత్రం ఉత్సవ మూర్తి ప్రహ్లదరాయులను బంగారు పల్లకి, ఉంజలసేవ, నవరత్న స్వర్ణ రథంపై ఉరేగింపు.
* కడప: ఆప్ కి అవాజ్ నేతృత్వంలో నేడు నగరంలో టిప్పుసుల్తాన్ వర్ధంతి వేడుకలు.
* కడప: రేపు జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో నిరుద్యోగులకు జాబ్ మేళా.. పడవ తరగతి నుంచి ఆపై విద్యార్హత ఉన్న యువకులకు అవకాశం…
* ఎన్టీఆర్ జిల్లా: జగ్గయ్యపేట మండల వేదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి రాత్రి శ్రీ భూనీల సమిత యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణం మహోత్సవం