నేడు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం.. సీఈసీ అనుమతి ఇవ్వడంతో ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ.. కేబినెట్ లో అత్యవసర అంశాలు మాత్రమే చర్చించాలన్న సీఈసీ..
నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత జ్యూడీషియల్ రిమాండ్..
నేడు ఖమ్మంలో కేటీఆర్ పర్యటన.. ఇల్లందు, కొత్తగూడెం, ఖమ్మంలలో పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మద్దతుగా కేటీఆర్ ప్రచారం..
నేడు ల్యాండ్ ఇష్యూపై సీఎం, కలెక్టర్ కు మల్లారెడ్డి ఫిర్యాదు..
ఏపీలో అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధం.. ఉదయం. 10 గంటలకు డీజీపీకి నివేదిక అందించనున్న సిట్.. మధ్యాహ్నం సీఎస్ ద్వారా సీఈఓ, సీఈసీకి ప్రాథమిక నివేదిక..
నేటి నుంచి తెలంగాణ టెట్ పరీక్షలు.. ఆన్ లైన్ లో జూన్ 2 వరకు టెట్ ఎగ్జామ్స్.. ఉదయం 9 నుంచి 11. 30 వరకు మొదటి సెషన్.. మధ్యాహ్నం. 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు రెండో సెషన్.. పేపర్-1కు 99,958 మంది అభ్యర్థుల దరఖాస్తులు.. పేపర్-2కు 1, 86, 428 మంది దరఖాస్తులు.. 15 నిమిషాల ముందే గేట్ మూసివేత..
నేడు ఐదో విడత లోక్ సభ ఎన్నికలకు పోలింగ్.. ఉదయం 7 నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్.. 8 రాష్ట్రాల్లో 49 స్థానాలకు జరగనున్న పోలింగ్.. ఐదో విడతల 659 మంది అభ్యర్థులు పోటీ..