* పార్వతీపురం మన్యం జిల్లా కురుపులు నియోజకవర్గంలో నేడు సీఎం వైఎస్ జగన్ పర్యటన.. అమ్మ ఒడి పథకం నిధులను బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్
* తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా స్వామివారి దర్శనం.. టోకెన్‌లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం
* ప్రకాశం : త్రిపురాంతకం మండలం విశ్వనాదాపురంలో గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంబించి గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.
* నేడు కాజులూరు మండలం, కుయ్యూరులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి చెల్లుబోయిన వేణు
* రేపు తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక అలంకారంలో అన్నవరం సత్యదేవుడు.. ఈనెల 29 నుంచి జూలై 3 వరకు మహావిష్ణువు అలంకారంలో దర్శనం ఇవ్వనన్న స్వామి వారు.. అనంత లక్ష్మి సరస్వతి దేవి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ
* విశాఖ: నేటి నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలులోకి రానున్న ఈ-స్టాంపింగ్ విధానం.. నాన్ జ్యుడీషియల్ స్టాంపు పేపర్ల కొరత, అక్రమాలకు చెక్. ఇకపై అన్ని లావాదేవీలు ఈ-స్టాంపింగ్ విధానం ద్వారానే నిర్వహించేందుకు సన్నాహాలు.
* తూర్పుగోదావరి జిల్లా : నేడు హోం మంత్రి తానేటి వనిత పర్యటన.. ఉదయం 10 గంటలకు దేవరపల్లి మండలం దేవరపల్లిలో అమ్మ ఒడి కార్యక్రమం లో పాల్గొంటారు. మ. 12:30 గంటలకు నల్లజర్ల జగన్నాథపురం రోడ్ అల్లాడి కళ్యాణమండపం నందు జరుగు ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొంటారు.. మ. 01:15 గంటలకు తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామం డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహం నందు జరుగు ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొంటారు. రాత్రి 7:40 గంటలకు కొవ్వూరు టౌన్ 4 వ వార్డు నందు జరుగు ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొంటారు.
* నెల్లూరులోని బిజెపి జిల్లా కార్యాలయంలో బీ.సీ. మోర్చా నేతల సమావేశం
* తూర్పుగోదావరి జిల్లా : నేడు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య యాత్ర ..
* నెల్లూరు జిల్లా: జులై 13న మధ్యాహ్నం 2 గంటల 30 నిముషాలకు చంద్రయాన్-3 ప్రయోగం.. రాకెట్ అనుసంధానాన్ని పూర్తి చేసిన శాస్రవేత్తలు.. ప్రయోగంపై శాస్రవేత్తలతో ఇస్రో చైర్మన్ డా.సోమ్ నాథ్ సమీక్ష
* విశాఖ: నేడు సీఎం వైఎస్ జగన్ కురుపాం పర్యటనకు వెళ్తూ కొద్ది సేపు ఎయిర్ పోర్టులో ఆగనున్న జగన్..
* పశ్చిమ గోదావరి: భీమవరం పాలకొల్లులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పర్యటన.. అమ్మబడిన నగదు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి..
* విశాఖ: ఆంధ్రా యూనివర్శిటీ విద్యార్థులకు వేసవి సెలవులు పొడిగింపు.. జులై 9న రీ ఓపెనింగ్.. హాస్టళ్లలో అంతర్గత మరమ్మతులు కారణంగా సెలవులు పొడిగించిన యాజమాన్యం
* విశాఖ: నేడు సింహాద్రి అప్పన్న సన్నిధిలో తుది విడత చందనం అరగదీత ప్రారంభం.. ఆషాఢపౌర్ణమి నాడు 125 కేజీల ఆఖరి విడత పచ్చిచందనాన్ని స్వామికి అలంకరణ..
* అమరావతి: వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టు విచారణ
* చంద్రబాబు కరకట్ట నివాసం జప్తు ఆదేశాలు ఇవ్వాలన్న సీఐడీ పిటిషన్ పై నేడు తీర్పు ఇవ్వనున్న ఏసీబీ న్యాయస్థానం
* వరంగల్: శ్రీ భద్రకాళి దేవస్థానంలో శ్రీ శాకాంబరి నవరాత్రి మహోత్సవంలో భాగంగా 10వ రోజు ఉదయం నీలా క్రమం, సాయంత్రం నిత్యా నిత్యా క్రమంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న అమ్మవారు..
* నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టరేట్ల ఎదుట పెన్షనర్ల ధర్నా.
* జనగామ జిల్లా: రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య కిడ్నాప్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అంజయ్యను నేడు పోలీస్ కస్టడీకి తీసుకోనున్న పోలీసులు.. అంజయ్య తో పాటు మరో ఇద్దరిని రెండు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చిన వరంగల్ కోర్టు.
* రేపు ఖమ్మంకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాక.. 2 న జరుగనున్న ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ సభ స్థలం పరిశీలన
* 105వ రోజుకు చేరిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర.. సూర్యాపేట జిల్లాలో కొనసాగుతోన్న యాత్ర.. కోదాడ నియోజకవర్గం మోతే గ్రామం నుంచి పాదయాత్ర ఉదయం 9 గంటలకు ప్రారంభం.. మోతే, హుస్సేనాబాద్, మామిళ్ల గూడెం వరకు పాదయాత్ర.. మామిల్లగూడెం గ్రామ శివారులో మధ్యాహ్నం లంచ్ బ్రేక్.. సాయంత్రం పాదయాత్రకు విరామం
* హైదరాబాద్: రేపటి నుండి వారం రోజుల పాటు బీజేపీ మేరా బూత్ సబ్ సే మజ్బూత్ కార్యక్రమం.. ఇతర రాష్ట్రాల నుండి రాష్ట్రానికి రానున్న 600 మంది విస్తారక్‌లు.. పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ పరిస్థితి, కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు, ప్రజల స్పందన ఎలా ఉంది.. ఏమీ కోరుకుంటున్నారు అనే అంశాల పై ఆరా తీయనున్న కార్యకర్తలు..
* పల్నాడు: నేడు నాదెండ్ల మండలం సంకురాత్రి పాడులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి విడుదల రజిని…
* బాపట్ల : భట్టిప్రోలు మండలం పెసర్లంక గ్రామంలో నేడు గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున…
* పల్నాడు: నేడు గురజాల నియోజకవర్గంలో టీడీపీ అధ్వర్యంలో భవిష్యత్తుకు భరోసా బస్సు యాత్ర… పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామంలో బస్సు యాత్ర …..
* పల్నాడు: నేడు బ్రాహ్మణపల్లి లో భవిష్యత్తుకు భరోసా కార్యక్రమంలో భాగంగా టిడిపి బహిరంగ సభ.. హాజరుకానున్న మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ ,నక్క ఆనంద్ బాబు తదితరులు….