* మహారాష్ట్రలోని షోలాపూర్ ధారాశివు జిల్లాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటన.. ఉదయం పండరీపురంలోని శ్రీ విట్టల్ రుక్మిణి దేవస్థానాన్ని సందర్శించి పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆ తర్వాత విఠలేశ్వరునికి సన్నిధిలో పూజలు చేస్తారు. సర్కోలిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తుల్జా భవాని అమ్మవారి దేవస్థానానికి చేరుకొని పూజలు నిర్వహిస్తారు. అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.
* నేడు మ. 12 గంటల నుంచి 2 గంటల వరకు తెలంగాణ కాంగ్రెస్ స్ట్రాటజీ మీటింగ్. రాహుల్ నేతృత్వంలో సమావేశం. హాజరుకానున్న మాణిక్ రావు థాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్యనేతలు. ఎన్నికల వ్యూహాలపై చర్చ
* పశ్చిమ గోదావరి: నేడు భీమవరంలో పవన్ కల్యాణ్ పర్యటన.. పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించనున్న జనసేన అధినేత
* వరంగల్: కాకతీయ యూనివర్సిటీలో బయోటెక్నాలజీ భాగం ఆధ్వర్యంలో నేటి నుండి మూడు రోజులపాటు అంతర్జాతీయ సదస్సు.. ప్లాంట్ బయోటెక్నాలజీ అండ్ జీనొమ్ ఎడిటింగ్ అంశంపై ఎనిమిది దేశాల నుండి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పాల్గొంటారని తెలిపిన విసి.
* వరంగల్: శ్రీ భద్రకాళి దేవస్థానంలో శ్రీ శాకాంబరి నవరాత్రి మహోత్సవంలో భాగంగా తొమ్మిదవ రోజు ఉదయం దిప్తా క్రమం, సాయంత్రం కుల సుందరీ క్రమంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న అమ్మవారు..
* సూర్యాపేట జిల్లా: 104 వ రోజుకు చేరిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర.. సూర్యాపేట నియోజకవర్గంలోని చివ్వెంల మండలం మోదినీపురం నుంచి ఉదయం 8.30 గంటలకు ప్రారంభం కానున్న పాదయాత్ర. తిమ్మాపురం, బి చందుపట్ల, నామవరం స్టేజ్ మీదుగా మోతే వరకు సాగనున్న పాదయాత్ర. చందుపట్ల శివారులో లంచ్ బ్రేక్.. మోతిలో రాత్రి బస చేయనున్న భట్టి
* ప్రకాశం : పెద్దారవీడు మండలం బద్వీడు చెర్లోపల్లిలో గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్..
* తూర్పుగోదావరి జిల్లా : ఉదయం 11 గంటలకు తాళ్లపూడి మండలం తాళ్లపూడి గ్రామం నందు జరుగు జల జీవన్ మిషన్ పథక శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్న హోం మంత్రి తానేటి వనిత.. మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రి కలెక్టరేట్ నందు జరుగు జిల్లా అభివృద్ధి కో – ఆర్డినేషన్ & పర్యవేక్షణ కమిటీ మీటింగ్ లో పాల్గొంటారు.
* శ్రీ సత్యసాయి : హిందూపురంలో నేడు మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం
* చిత్తూరు: గంగాధర నెల్లూరు మండలం కడప గుంట సచివాలయ పరిధిలో గడపగడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి
* అనంతపురం : విద్యుత్ చార్జీలు పెంపునకు వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో నగరంలోని ఎన్జీఓ హోమ్ లో రౌండ్ టెబుల్ సమావేశం.
* జులై 4వ తేదీన సీఎం జగన్ చిత్తూరు పర్యటన..
* నేడు సింహాద్రి అప్పన్నకు వరదపాయసం.. వైకుంఠవాసుని మెట్టపై వరదపాయసం.. వైకుంఠవాసుని విశేష పూజలు, అభిషేకాలు.. సకాలంలో వర్షాలు పడాలని, పంటలు బాగా పండాలని పాయసం ఉత్సవం..
* నేడు సింహాద్రి అప్పన్న సోదరి బంగారు తల్లి పండుగ.. భారీ ఏర్పాట్లు చెసిన సింహాచలం దేవస్థానం.. ఇప్పటికే అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పిస్తున్న మహిళలు
* విశాఖ: గాజువాక నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ మంత్రి విడదల రజనీ పర్యటన.. కణితి-వడ్లపూడి ఆర్. హెచ్ కాలనీలో డా.వై.ఎస్.ఆర్. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం – ప్రారంభోత్సవం
* విజయనగరం: నేడు పౌరసరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావు జిల్లాకు రాక.. ఆరు జిల్లాల పౌరసరఫరాల అధికారులు, జిల్లా మేనేజర్ లతో ప్రాంతీయ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల అధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు.
* విశాఖ పార్లమెంట్ పరిధిలో టీడీపీ చైతన్య రథయాత్ర.. గాజువాకలో నేడు బహిరంగ సభ
* తిరుమల: 9 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73,156 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 28,175 మంది భక్తులు, హుండీ ఆదాయం రూ.4.29 కోట్లు
* విజయనగరం: జిల్లా అధికారులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టరేట్ లో మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్ష సమావేశం..
* డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు.. నేడు మాడుగుల మండలం తాడిపర్తి గ్రామంలో నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు.