* నేడు దేశవ్యాప్తంగా ‘గ్రామీణ భారత్ బంద్’ నిర్వహించనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం), కేంద్ర కార్మిక సంఘాల ప్రకటన.. కేంద్రంలోని మోదీ సర్కార్ అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ బంద్.. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ బంద్.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశవ్యాప్తంగా ప్రధాన రహదారులపై రైతులు, కార్మికులు ‘చక్కా జామ్’
* జీఎస్‌ఎల్వీ-ఎఫ్14 రాకెట్ ప్రయోగానికి ఈ రోజు మధ్యాహ్నం 2.05 గంటలకు ప్రారంభంకానున్న కౌంట్‌డౌన్.. రేపు సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్వీ-ఎఫ్14 రాకెట్ ప్రయోగం.. INSAT-3DS ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టనున్న ఇస్రో..
* తిరుమల: ఇవాళ శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు.. ఉదయం 5:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వాహన సేవలు, ఉ. 5:30 గంటలకు సూర్యప్రభ వాహన సేవ, 9 గంటలకు చిన్న శేష వాహనం, 11 గంటలకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనం, 2 గంటలకు చక్రస్నానం, సాయంత్రం 4 గంటలకు కల్పవృక్షవాహనం, 6 గంటలకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహన సేవ.. ఇవాళ శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు
* రేపటి వరకు తిరుపతిలో జారి చేసే సర్వదర్శన టోకెన్లు రద్దు చేసిన టీటీడీ
* హైదరాబాద్: నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. నేడు సభలో కులగణన తీర్మానం.. ఉదయం 10 గంటలకు సభలో తీర్మానం పెట్టనున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. ఆ తర్వాత నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం పెట్టనున్న ప్రభుత్వం.
* ప్రకాశం : ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మూడు రోజుల వ్యవధిలో సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలు.. రేపు బాపట్ల జిల్లా ఇంకొల్లులో టీడీపీ ఆధ్వర్యంలో రా.. కదలిరా.. సభకు హాజరుకానున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. ఈ నెల 20వ తేదీన ఒంగోలులో సీఎం జగన్ పర్యటన.. ఒంగోలు నియోజకవర్గంలో 25 వేల పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్..
* ప్రకాశం : మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో రథసప్తమి పర్వదినం సందర్భంగా ఉదయం నుండి రాత్రి వరకు సప్త వాహనాలపై నాలుగు మాడవీధులలో అంగరంగ వైభవంగా భక్తులకు దర్శనం ఇవ్వనున్న స్వామివారు.. ప్రతి వాహనం వెంట సాంస్కృతిక కార్యక్రమాలు..
* ప్రకాశం : ఒంగోలు చెన్నకేశవ స్వామి ఆలయంలో రథ సప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు..
* ప్రకాశం : ఒంగోలులో భారత్ బంద్ సందర్భంగా వామపక్షాల ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ.. సంఘీభావం తెలుపనున్న ప్రజా, రైతు సంఘాలు..
* ప్రకాశం : గిద్దలూరులో నూతన వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీ మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి..
* ప్రకాశం: దర్శిలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి..
* శ్రీకాకుళం జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంలో ఘనంగా ప్రారంభమైన రథసప్తమి వేడుకలు.. మేళతాళలతో, వేద మంత్రోచ్ఛరణతో పులకిస్తున్న అనివెట్టి మండపం.. తొలి పూజను నిర్వహిస్తున్న విశాఖ శారద పీఠం నుండి ఉత్తరదికారి సాత్మానందేంద్ర సరస్వతి.. సూర్య దేవుని మూల విరాట్ కి ప్రారంభమైన క్షీరాభిషేకం
* శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ఘనంగా ప్రారంభమైన శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు. అర్ధరాత్రి దాటిన తరువాత స్వామివారి జయంతి ఉత్సవానికి అంకురార్పణ చేసిన వేదపండితులు. వేదపారాయణoతో అదిత్యుని మూలవిరాట్ కి క్షీరాభిషేకo నిర్వహించిన ఆలయ పండితులు.. క్షీరాభిషేకం అనంతరం త్రిచ, చౌరం, ఆరుణం, నమకం, చమకాలతో అభిషేకపూజలు నిర్వహించిన ఆలయ వేదపండితులు.
* కాకినాడ: నేడు అన్నవరం సత్య దేవుని కొత్త రథం ప్రారంభం.. ప్రత్యేక పూజలు అనంతరం నూతన రథం పై ఊరేగనున్న స్వామి, అమ్మ వారు
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ పర్యటన వివరాలు.. రాజమండ్రి రూరల్ కొంతమూరు గ్రామంలో స్వచ్ఛత-మన భాద్యత శానిటేషన్ పై ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమం.. ఉదయం 8 గంటలకు కోంతమూరు పంచాయతి కార్యలయం దగ్గర నుండి ప్రారంభం.. అనంతరం ఉదయం:10:45గంటలకు జననన్న పేదలందరికి ఇళ్లు పథకంలో భాగంగా టిడ్కో గృహాలు లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం
* నెల్లూరు జిల్లా: వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముత్తుకూరు ..మనుబోలు మండలాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నెల్లూరు రూరల్ మండలం కోడూరుపాడు లో ఇంటింట ప్రచారం లో పాల్గొన్న ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి
* నెల్లూరు: ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్న ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి
* నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి
* విశాఖ: నేడు దేశ వ్యాప్త పారిశ్రామిక సమ్మె , గ్రామీణ బంద్.. విశాఖలోని సరస్వతి పార్కు నుంచి అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ వరకు ప్రదర్శన. స్టీల్ ప్లాంట్ సహా భారీ పరిశ్రమలపై కనిపించనున్న సమ్మె ప్రభావం
* నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎన్నికల సన్నద్దతపై సమీక్షించనున్న వైవీ సుబ్బారెడ్డి, మంత్రి అమర్నాథ్
* అమరావతి: రాజధాని ఫైల్స్ సినిమాపై నేడు తీర్పు ఇవ్వనున్న ఏపీ హైకోర్టు.. నిన్న విడుదల కావాల్సిన సినిమాను ఇవాళ వరకు విడుదల చేయకుండా స్టే ఇచ్చిన హైకోర్టు
* అనంతపురం : ఉరవకొండ పరిధిలోని బూదగవిలోని సూర్య దేవాలయంలో రథసప్తమి వేడుకలు.
* అనంతపురం : నేడు రాయలసీమ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం. హాజరు కానున్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాకూర్.
* ఏలూరు: మంత్రి తానేటి వనిత షెడ్యూల్జజ ఉదయం 10:00 గంటలకు గోపాలపురం మండలం కరగపాడు గ్రామంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం, మధ్యాహ్నం 12 గంటలకు గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం. 3 గంటలకు గోపాలపురం మండలం గుడ్డిగూడెం గ్రామంలో నాయకులు, కార్యకర్తలతో భేటీ, 5 గంటలకు గోపాలపురం మండలం రేగులకుంట గ్రామంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం. 6 గంటలకు దేవరపల్లిలో జరిగే మండల స్థాయి బూత్ కమిటీ మీటింగ్ లో పాల్గొంటారు.
* విజయవాడ: జగ్గయ్యపేటలో నేడు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన.. 150 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించనున్న గవర్నర్
* విజయవాడ: మైలవరంలో వైసీపీ సమావేశం.. హాజరుకానున్న ఎంపీ అయోధ్య రామిరెడ్డి, కేశినేని నాని, నియోజక వర్గ ఇంఛార్జ్ తిరుపతి రావు
* శ్రీ సత్యసాయి : హిందూపురంలో నేటి నుంచి శ్రీ పేట వెంకటరమణ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు.
* అనంతపురం: పెద్దపప్పూరు మండలంలో కొనసాగుతున్న టీడీపీ యువ చైతన్య బస్సు యాత్ర.
* అనంతపురం: బుక్కరాయసముద్రంలో రేపటి నుంచి కొండమీద రాయుడు బ్రహ్మోత్సవాలు ప్రారంభం.
* విజయవాడ: నేడు నగరానికి రానున్న DRDO చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి
* శ్రీ సత్యసాయి : నేడు గోరంట్ల మండలంలోని గ్రామాలలో మంత్రి ఉషశ్రీ చరణ్ ఆత్మీయ పలకరింపు యాత్ర.