What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేటి నుంచి భారత్-ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్.. రాజ్‌కోట్ వేదికగా మ్యాచ్
* ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత.. నేడు రైతు సంఘాలతో చర్చలు జరపనున్న కేంద్రం
Also Read
- Hanamkonda: న్యాయం చేయమంటే నరకం చూపించాడు.. మహిళపై నాలుగేళ్లుగా ఎస్ఐ అత్యాచారం!
- Shubman Gill: "డోంట్ వర్రీ".. రోహిత్ రనౌట్ వివాదంపై శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Pawan Kalyan: నేడు ఢిల్లీకి పవన్ కళ్యాణ్.. జనసేన జాతీయ విస్తరణ దిశగా కీలక అడుగు!
- Modi-Trump Meeting: మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు.. 16 నెలల తరువాత ఎదురుపడనున్న మోడీ, ట్రంప్..
* తిరుమల: 18 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు, శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,275 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 25,293 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.07 కోట్లు
* హైదరాబాద్: నేడు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ వేయనున్న రేణుకాచౌదరి, అనిల్‌కుమార్ యాదవ్.. హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, దిగ్విజయ్‌సింగ్
* హైదరాబాద్: బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా నేడు నామినేషన్ వేయనున్న వద్దిరాజు రవిచంద్ర
* నేడు మల్లన్న భక్తుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం కొమురవెల్లిలో నిర్మించ తలపెట్టిన రైల్వే స్టేషన్ ను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారితో కలిసి శంకుస్థాపన చేయనున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
* నంద్యాల: శ్రీశైలంలో రేపటి నుంచి 21 వరకు మహా కుంభాభిషేక మహోత్సవం.. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డికి ఆహ్వానం
* కాకినాడ: నేడు తునిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనున్న మంత్రి దాడిశెట్టి రాజా
* తిరుమల: రేపు శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు.. ఉదయం 5:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వాహన సేవలు.. 7 వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి.. ఇవాళ, రేపు, ఎల్లుండి తిరుపతిలో జారి చేసే సర్వదర్శన టోకేన్లు రద్దు చేసిన టీటీడీ.. రేపు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు
* ప్రకాశం : చీమకుర్తి మండలంలోని మూడు గ్రామాలలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగు నాగార్జున, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.
* నెల్లూరు జిల్లా: మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు.. మనుబోలు మండలాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
* నెల్లూరు: నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆధ్వర్యంలో బీజేపీ నేతల సమావేశం..
* నెల్లూరు: చేజర్ల మండలంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి
* నెల్లూరు: నారాయణరెడ్డిపేట మైపాడు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్న నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి.. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
* విశాఖ: వికసిత్ భారత్ ప్రణాళికల కోసం నేడు నీతి ఆయోగ్ సమావేశం. మత్స్యశాఖపై నిర్వహిస్తున్న వర్క్ షాప్‌లో పాల్గొననున్న నీతి ఆయోగ్ సభ్యుడు
* విశాఖ: నేడు కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల పర్యటన.. ఫిషరీస్ వర్క్ షాపు లో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి..
* విశాఖ: DLB గ్రౌండ్‌లో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేయనున్న పురుషోత్తం రూపాల, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.
* అనంతపురం : తాడిపత్రి రూరల్ పరిధిలోని ఆర్‌డీటీ కాలనీ సమీపంలో నూతనంగా నిర్మించిన టిడ్కో గృహల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.
* తూర్పుగోదావరి జిల్లా: నేడు హౌసింగ్ స్కీమ్ లబ్ధిదారులను జగన్ ప్రభుత్వం దగా చేసిందనే ఆరోపణలపై బాధితుల తరపున రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా నిరసన.. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో ఆందోళన
* పశ్చిమగోదావరి జిల్లా: తాడేపల్లిగూడెంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ.. అనంతరం విజయవాడ వెళ్ళనున్న మంత్రి
* తిరుపతి: రేపు పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు.. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వాహన సేవలు.. 7 వాహనాలు పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్న పద్మావతి అమ్మవారు..
* ఇవాళ సీఎం వైఎస్ జగన్ కర్నూలు, గుంటూరు జిల్లాల పర్యటన.. కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరుకానున్న సీఎం.. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వలంటీర్ల అభినందన సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
* విజయవాడ: నేడు మైలవరంలోని రెడ్డిగూడెం మండలంలో ఆసరా కార్యక్రమం.. హాజరు కానున్న మంత్రి జోగి రమేష్, ఎంపీ కేశినేని నాని
* విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని జై హింద్ పార్టీ అధ్వర్యంలో నేడు ధర్నా చౌక్ లో ధర్నా. పాల్గొననున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
* విజయవాడ: అగ్రి గోల్డ్ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నేడు ధర్నా చౌక్ లో న్యాయ పోరాట దీక్ష.. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేపట్టిన అగ్రీ గోల్డ్ కస్టమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్
* విజయవాడ: నేడు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకాన్ని ఆవిష్కరించనున్న ఇద్దరు నేతలు.. సాయంత్రం 7 గంటలకు జరిగే కార్యక్రమానికి హాజరు అవుతున్న సీపీఐ రామకృష్ణ, అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి
* తూర్పుగోదావరి జిల్లా : నేటి నుంచి ఉమ్మడి జిల్లాలో మూడు రోజులు జరగాల్సిన పవన్ కల్యాణ్ పర్యటన రద్దు.. పవన్ హెలీకాప్టర్ ల్యాండింగ్ కు అధికారులు అవరోధాలు సృష్టించారని
జనసేన పార్టీ ప్రకటన
* నేడు, తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌పై రిప్లై.. సభలో కుల, జనగణన బిల్లు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
* అమరావతి: రాజధాని ఫైల్స్ సినిమాపై నేడు తీర్పు ఇవ్వనున్న ఏపీ హైకోర్టు
తాజావార్తలు
-
9000mAh Battery Smartphones 2026: 9000mAh బ్యాటరీతో 2026లో బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే.. పూర్తి జాబితా!
-
The Deverakonda Foundation : స్వగ్రామంలో 180 మంది విద్యార్థులకు స్కాలర్షిప్… విజయ్ దేవరకొండ గొప్ప మనసు
-
Shubman Gill: నేను ఇప్పటివరకు గుర్తుండిపోయే క్యాచ్ అందుకోలేదు.. చాలా సంతోషంగా ఉంది!
-
Best Electric Scooters: ఓలా, హీరో, టీవీఎస్.. హైయెస్ట్ స్పీడ్ గల ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది? కేవలం రూ.44,990 నుంచే ప్రారంభం!
-
Explainer: ప్రేమిస్తే జైలుకు..? శృంగారంలో పరస్పర అంగీకారం ఉన్నా కూడా రే*ప్ కేసు అవుతుందా?
ట్రెండింగ్
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!