* నేడు ఏపీలో మోస్తారు వర్షాలు.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. కర్ణాటక నుండి కొమోరిన్ వరకు విస్తరించిన ద్రోణి.. వీటి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా
* విశాఖ: మూడో రోజుకు చేరిన వారాహి విజయ యాత్ర.. నేడు పెందుర్తి నియోజకవర్గానికి పవన్ కల్యాణ్, మాజీ వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్ధురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులకు పరామర్శ.. పార్టీ తరపున ఆర్థిక సహాయం అందజేసే అవకాశం. సాయంత్రం 4 గంటలకు విశాఖ నగరంలో సిరిపురం సీఎన్‌బీసీ భూములు పరిశీలించనున్న పవన్.
* హైదరాబాద్: నేడు కాంగ్రెస్ కీలక సమావేశం, బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలజీ కేంద్రంలో సాయంత్రం 4 గంటలకు పార్టీ ముఖ్య నేతల సమావేశం.. ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రచార వ్యూహంపై చర్చ, ప్రజా కోర్టులు నిర్వహించే ఆలోచనలో కాంగ్రెస్, ప్రభుత్వ వైఫల్యం, పార్టీ వ్యూహంపై చర్చ
* ప్రకాశం : యర్రగొండపాలెం మండలం మొగుళ్లపల్లిలో గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించిన అనంతరం గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.
* ప్రకాశం : ఒంగోలు గోపాల్ నగర్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..
* ఒంగోలులో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మన రాజ్యాంగం, ఒక అవగాహన అనే అంశంపై సెమినార్..
* తిరుమల: ఇవాళ శుద్ద తిరుమల- సుందర తిరుమల కార్యక్రమం.. అలిపిరి వద్ద జెండా ఊపి కార్యక్రమాని ప్రారంభించిన ఈవో ధర్మారెడ్డి.. పాల్గొననున్న 800 మంది ఎన్‌సీసీ విద్యార్దులు
* నేడు విశాఖలో తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ నాయకత్వంలోని ప్రతినిధులు బృందం పర్యటన.. భీమిలి మండలం నెరేళ్ల వలసలోని ఎస్.ఓ.ఎస్. విలేజ్ ను సందర్శించనున్న తెలంగాణ మంత్రి
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తారు
* నెల్లూరులోని అన్నమయ్య సర్కిల్లో తాళ్లపాక అన్నమాచార్య జయంతి సందర్భంగా సంకీర్తనావళి కార్యక్రమం
* తూర్పు గోదావరి జిల్లా: కొవ్వూరు డివిజన్ పరిధిలో 5 మండలాల్లో 7 గ్రామాలకు 9 గ్రామ వార్డులకు జరగనున్న ఎన్నికలకి 29 నామినేషన్లు దాఖలు.. గ్రామ పంచాయతీ ఉప ఎన్నికల. నామినేషన్ల వివరాలు వెల్లడించిన కొవ్వూరు డివిజనల్ పంచాయతి అధికారి
* తూర్పుగోదావరి జిల్లా: నేడు ఫ్యాప్టో పిలుపు మేరకు రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద 12 గంటల పాటు ధర్నా.. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, జీవో నెంబర్ 117 రద్దు చేయాలని, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ వైఖరి ని నిరసిస్తూ ఆందోళన
* తూర్పుగోదావరి జిల్లా : నేడు రాజానగరం జి.ఎస్.ఎల్ మెడికల్ కాలేజీ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పల్మనాలజీ సదస్సు.. నేడు రాజానగరం ఆదికవి నన్నయ యూనివర్సిటీ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆడియోలజిస్ట్స్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్స్ అసోసియేషన్ సదస్సు .
* నేడు రాజానగరం ఆదికవి నన్నయ యూనివర్సిటీ నందు ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే 15వ గ్రామోత్సవం 2023 కార్యక్రమంలో పాల్గొంటారు.
* అనంతపురం : ఓటరు జాబితా సవరణలో భాగంగా నేటి నుంచి రెండు రోజుల పాటు స్పెషల్ డ్త్రెవ్ .
* తిరుపతి: “అంతర్జాతీయ యువజన దినోత్సవం” సందర్భంగా అలిపిరి నుండి అరవింద్ కంటి ఆసుపత్రి వరకు 2K రన్ ను ప్రారంభించిన ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి..
* పశ్చిమ గోదావరి: తణుకులో మంత్రి కారుమూరి పర్యటన.. పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి
* తిరుమల: 23 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు, టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 72,158 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 30,735 మంది భక్తులు, హుండీ ఆదాయం రూ.4.08 కోట్లు