Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Whats Today As On April 22nd 2024

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Published Date :April 22, 2024 , 7:00 am
By Sudhakar Ravula
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

* ఢిల్లీ: నేడు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ.. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన కవిత.. మధ్యాహ్నం విచారణ.. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను మార్చి 15న అరెస్ట్ చేసిన ఈడీ, ఏప్రిల్ 11న అరెస్ట్ చేసిన సీబీఐ

* నేడు మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన.. ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గాల్లో పర్యటించనున్న సీఎం. ఉదయం11 గంటలకు ఆదిలాబాద్.. మధ్యాహ్నం 1 గంటకు నిజామాబాద్.. సాయంత్రం 4.15 గంటలకు మేడ్చల్ (మల్కాజ్‌గిరి లోక్ సభ నియోజకవర్గం) బహిరంగ సభల్లో పాల్గొననున్న సీఎం.

* కడప : నేడు ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం.. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ట్రాఫిక్ మళ్లింపు. కల్యాణ వేదిక సమీపం నుండి కడప మార్గంలో 10 చోట్ల, సాలాబాద్ వద్ద 5 ప్రదేశాల్లో ప్రత్యేకంగా వాహనాల పార్కింగ్ ఏర్పాటు. కడప నుండి తిరుపతి వైపు వెళ్లే వాహనాలు కడప నగరం అలంఖాన్ పల్లి ఇర్కాన్ జంక్షన్ నుండి ఊటుకూరు సర్కిల్, రాయచోటి మీదుగా తిరుపతి వెళ్లాలి.. ఇక, తిరుపతి నుండి కడప వైపు వచ్చే భారీ వాహనాలు, రవాణా వాహనాలు రేణిగుంట నుండి దారి మళ్లింపు.. వయా రాయచోటి మీదుగా కడపకు చేరుకోవాలి.

* ఏపీలో నేడు 26 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 64 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, రేపు 46 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 88 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండీ వెల్లడి.. నేడు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(26) : శ్రీకాకుళం 9, విజయనగరం 8, పార్వతీపురంమన్యం 9,
మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. ఇక, వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(64) : శ్రీకాకుళం10 , విజయనగరం 16, పార్వతీపురంమన్యం 4, అల్లూరి4, విశాఖపట్నం 1, అనకాపల్లి 3, కాకినాడ 1, ఎన్టీఆర్ 1, గుంటూరు 6, పల్నాడు 5, ప్రకాశం 9, నెల్లూరు 1, తిరుపతి 3 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడి.

* నద్యాల: నేడు శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోనున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. అనంతరం జగ్గంపేట, శృంగవరపుకోట నియోజకవర్గాల్లో ప్రజాగళం సభల్లో పాల్గొననున్న చంద్రబాబు నాయుడు.

* విశాఖ: నేడు ప్రధాన పార్టీల ఎంపీ అభ్యర్థుల నామినేషన్లు.. వైజాగ్ ఎంపీ స్థానం నుంచి బొత్స ఝాన్సీ (వైసీపీ), శ్రీ భరత్ – టీడీపీ, అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి బూడి ముత్యాల నాయుడు (వైసీపీ). అరకు వ్యాలీ.. కొత్తపల్లి గీత (బీజెపీ) నేడు నామినేషన్లు

* తిరుమల: ఇవాళ వసంతోత్సవాలలో రోండోవ రోజు.. ఉదయం 8 గంటలకు స్వర్ణరథంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి

* కాకినాడ: నేడు జగ్గంపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగించనున్న బాబు

* తిరుమల: ఇవాళ ఉదయం 10 గంటలకు జులై నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ.. మధ్యహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టిక్కేట్లను విడుదల చెయ్యనున్న టీటీడీ

* కడప : నేడు ఒంటిమిట్ట కోదండ రాముని కళ్యాణోత్సవం.. సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు పౌర్ణమి రోజున పండు వెన్నెల్లో జరగనున్న కల్యాణోత్సవం..

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలం మండలంలో జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు

* నెల్లూరు నగరంలోని మైపాడు గేట్ సెంటర్… సెట్టిగుంట రోడ్డు ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న వైసీపీ లోక్ సభ అభ్యర్థి విజయసాయి రెడ్డి

* నెల్లూరు: కావలి పట్టణంలోని వివిధ వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి

* కావాలి నియోజకవర్గంలోని అల్లూరు మండలం లో జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న నెల్లూరు లోక్ సభ టిడిపి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

* నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని అలంకార్ సెంటర్ మూలపేట ప్రాంతంలో ఎన్ని ప్రచారం నిర్వహించనున్న టిడిపి అభ్యర్థి నారాయణ

* నెల్లూరు: పొదలకూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న టిడిపి అభ్యర్థి సోమిరెడ్డి

* నెల్లూరు: కలిగిరి మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న ఉదయగిరి వైసీపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి

* నేడు గుంటూరు పార్లమెంటు స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్న టిడిపి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్..

* పల్నాడు: నేడు సత్తెనపల్లి టిడిపి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ…

* పల్నాడు : నేడు వినుకొండ అసెంబ్లీ స్థానానికి ,వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న సిట్టింగ్ ఎంఎల్ఏ బొల్లా బ్రహ్మనాయుడు.. నేడు గురజాల అసెంబ్లీ స్థానానికి టిడిపి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు..

* తూర్పుగోదావరి జిల్లా: నేడు జిల్లాలో జోరుగా నామినేషన్లు.. రాజమండ్రి పార్లమెంటు వైసీపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్, కాంగ్రెస్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు నామినేషన్లు.. భారీ ఊరేగింపుతో కలెక్టరేట్ కు బయలుదేరి వెళ్లనున్న అభ్యర్థులు. రాజమండ్రి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ రామ్, రాజానగరం జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ నామినేషన్లు

* ప్రకాశం : ఇవాళ జిల్లాలో ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు.. ఒంగోలు అసెంబ్లీ వైసీపీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేయనున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. కొండేపి వైసీపీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేయనున్న మంత్రి ఆదిమూలపు సురేష్.. మార్కాపురం వైసీపీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేయనున్న అన్నా రాంబాబు..

* బాపట్ల : పర్చూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న ఏలూరి సాంబశివరావు.. అద్దంకి అసెంబ్లీ వైసీపీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేయనున్న పాణెం చిన హనిమిరెడ్డి..

* అనంతపురం : అనంతపురం అర్భన్ వ్తెసీపీ అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ వేయనున్న అనంతవెంకట్రామిరెడ్డి.

* అనంతపురం : ఉరవకొండ నియోజకవర్గం వ్తెసీపీ అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ వేయనున్న వ్తె.విశ్వేశ్వరరెడ్డి.

* ప్రకాశం : ఇవాళ యర్రగొండపాలెంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పర్యటన.. యర్రగొండపాలెం కాంగ్రెస్ అభ్యర్థి బూదాల అజితారావు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న షర్మిల.. అనంతరం యర్రగొండపాలెం, చీమకుర్తి బహిరంగ సభలలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్న షర్మిల..

* అనంతపురం : గుంతకల్ ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్న టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం.

* కర్నూలు: నేడు ఆదోనిలో నామినేషన్ వేయనున్న వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి…

* కర్నూలు: నేడు పత్తికొండలో నామినేషన్ వేయనున్న సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్రయ్య

* కర్నూలు: నేడు పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కర్నూలులో నామినేషన్ వేయనున్న కాటసాని రాంభూపాల్ రెడ్డి

* పశ్చిమగోదావరి జిల్లా: నేడు జిల్లాలో రెండో రోజు పవన్ కల్యాణ్‌ పర్యటన.. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొనున్న పవన్

* శ్రీ సత్యసాయి : మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో మడకశిర నియోజకవర్గ టిడిపి విస్తృతస్థాయి సమావేశం.

* అనంతపురం : బొమ్మనహాళ్ మండలం చంద్రగిరి గ్రామంలో ఎలుగుబంటి సంచారం.. భయాందోళనలో గ్రామస్థులు.

* రాయచోటి వైసిపి అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న గడికోట శ్రీకాంత్ రెడ్డి… ప్రొద్దుటూరు వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న రాచమల్లు .శివప్రసాద్ రెడ్డి.. కమలాపురం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న రవీంద్రనాథ్ రెడ్డి.. బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న డాక్టర్ సుధ…

* కడప: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సతీమణి సమతా రెడ్డి , డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సతీమణి ఫాతిమా నేటి నుంచి ఎన్నికల ప్రచారం.. కడప పెద్ద దర్గా లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

* నంద్యాలలో నేడు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న బైరెడ్డి శబరి

* శ్రీ సత్యసాయి : నేటి నుంచి రెండు రోజులపాటు లేపాక్షి మండలంలో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం

* తిరుపతి: పుంగనూరు అభ్యర్ధిగా నామినేషన్ వేయనున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రా రెడ్డి. చల్లా బాబు నామినేషన్లో పాల్గొననున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, సీకే బాబు.

* తిరుమల: 3 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 77,366 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 24,375 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.38 కోట్లు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • today events
  • Today Events as on April 22nd 2024
  • What’s Today
  • whats today

తాజావార్తలు

  • AP IAS Transfers: ఏపీలో కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు..

  • Off The Record: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ నేతలపై సీరియస్

  • Donald Trump: మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం.. ‘మీరు పిరికివారు’ అంటూ విమర్శ..

  • Boat Valour Watch 1R: ప్రీమియం లుక్, లాంగ్ బ్యాటరీ.. boAt ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ వాలర్ వాచ్ 1R రిలీజ్

  • Exam Results: ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions