What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఐపీఎల్ 2024: నేడు ముంబైతో రాజస్థాన్ రాయల్స్ ఢీ.. రాత్రి 7.30 గంటలకు ముంబై వేదికగా మ్యాచ్
* ఢిల్లీ: నేడు రౌస్ ఎవిన్యూ కోర్టులో లిక్కర్ కేసు విచారణ.. ఇప్పటికే ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. తీహార్ జైల్లో ఉన్న కవిత.. నేడు కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్‌గా ఇషాన్ కిషన్.!
* నేటితో ముగియనున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ.. నేడు కోర్టులో కేజ్రీవాల్‌ను హాజరుపర్చనున్న ఈడీ
* హైదరాబాద్: ఈ రోజు ఉదయం 10 గంటలకు మెదక్ పార్లమెంటు నియోజక వర్గంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష.. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ.. మెదక్ సమావేశం తర్వాత ఢిల్లీకి రేవంత్
* శ్రీ సత్యసాయి : ఐదో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. సంజీవపురం బస చేసిన ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న యాత్ర. బత్తలపల్లి, రామాపురం, కట్ట కిందపల్లి, రాళ్ళ అనంతపురం, ముదిగుబ్బ, ఎన్ ఎస్ పి కొట్టల, మలకవేముల మీదుగా పట్నం వరకు కొనసాగనున్న రోడ్ షో . పట్నం నడింపల్లి, కాలసముద్రం, ఎర్ర దొడ్డి మీదుగా కుటగుళ్ల వద్ద మధ్యాహ్న భోజన విరామం. కదిరి పట్టణం చేరుకుని పి వి ఆర్ ఫంక్షన్ హాల్ లో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొననున్న సీఎం జగన్ . అనంతరం మోటుకపల్లె మీదుగా జోగన్న పేట, ఎస్ ములకలపల్లె, మీదుగా వెళ్లి చీకటిమనిపల్లెలో రాత్రి బస.
* అమరావతి: ప్రజాగళం సభలకు రెండు రోజులు బ్రేక్. బాపట్ల నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లనున్న చంద్రబాబు.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు.. క్షేత్ర స్థాయిలో పరిస్థితిపై రెండు రోజుల్లో సమీక్షించుకోనున్న టీడీపీ అధినేత.
* ప్రకాశం : సింగరాయకొండలో యాదవ ఆత్మీయ సమావేశంలో పాల్గొననున్న వైసీపీ పార్లమెంట్ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మంత్రి ఆదిములపు సురేష్..
* నెల్లూరు : గుడ్లూరులో వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్ధి బుర్రా మధుసూధన్ యాదవ్..
* ప్రకాశం : కొనకనమెట్లలో వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం, హాజరుకానున్న వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్ధి అన్నా రాంబాబు..
* ప్రకాశం : దొనకొండ మండలం పోలేపల్లిలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న దర్శి వైసీపీ అభ్యర్ధి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ..
* కాకినాడ: అన్నవరం సత్యదేవుని ఆలయ పునః నిర్మాణం జరిగి నేటికి 12 ఏళ్లు.. పుష్కర కాలం పూర్తి అయిన సందర్భంగా నేడు ప్రత్యేక పూజలు, పండిత సత్కారాలు, నివేదన
* కడప : రాజంపేటలో నేడు టీడీపీ అసమ్మతి నేత బత్యాల చంగల్ రాయుడు ఆత్మీయ సమావేశం…
* కడప: మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారిమఠం మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి…
* కడప: రైల్వే కోడూరులో వైసీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న ఎంపీ మిథున్ రెడ్డి
* తిరుమల: రేపు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. ఈ సందర్భంగా రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళపాదపద్మారాధన సేవలు రద్దు చేసిన టీటీడీ
* శ్రీ సత్యసాయి : రేపటితో ముగియనున్న కదిరిలో శ్రీ ఖాద్రీలక్ష్మీనరసింహా స్వామి బ్రహ్మోత్సవాలు.
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తోటపల్లి గూడూరు మండలంలోని వివిధ గ్రామాల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు
* నెల్లూరు లోక్ సభ వైసిపి అభ్యర్థి విజయసాయిరెడ్డి కోవూరులో జరిగే ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డితో కలిసి పాల్గొంటారు
* నెల్లూరు: కొండాపురం లోని వివిధ ప్రాంతాలలో విజయ సంకల్ప యాత్ర నిర్వహించనున్న ఉదయగిరి వైసీపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి
* నెల్లూరు: ఆత్మకూరు రూరల్.. ఏ.ఎస్.పేట.. మండలాల్లోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి
* తిరుమల: 21వ తేది నుంచి మూడు రోజులు పాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు.. మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ
* తూర్పుగోదావరి జిల్లా: సచివాలయం వద్ద ఏప్రియల్ 3 నుంచి సామజిక భద్రత పెన్షన్ల పంపిణీ- కలెక్టర్ మాధవీలత
* విశాఖ: నేటి నుంచి అచ్యుతాపురంలో ప్రారంభం కానున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిఫైనరీ సేవలు.. ఏపీ, తెలంగాణ, ఒడిషా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు నూతన రిఫైనరీ నుంచి పెట్రోల్, డీజిల్ సరఫరా చేయనున్న ఐవోసి
* అనంతపురం : నేటి నుంచి పది మూల్యాంకనం.. జిల్లాకు చేరిన 1.80 లక్షల జవాబు పత్రాలు.
* శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలపై నేడు నంద్యాలలో అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం
* నంద్యాల: బనగానపల్లె (మం) యాగంటి ఉమా మహేశ్వర స్వామి క్షేత్రంలో నేడు ప్రత్యేక పూజలు, బిల్వార్చన, స్వామి అమ్మవార్ల కు మహా మంగళహారతి
* గుంటూరు: నేటి నుండి కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ…
* పల్నాడు: నేటి నుండి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నరసరావుపేటలో వేసవి క్రికెట్ శిక్షణ తరగతులు..
* అన్నమయ్య: రేపు మదనపల్లెలో సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్దం సభ.. భారీ ఏర్పాట్లు చేస్తున్న నేతలు..
* ఖమ్మం: నేడు పాలేరు రిజర్వాయర్ కి మంచి నీటి అవసరాల కోసం సాగర్ నీటి విడుదల…
* హైదరాబాద్: నేడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి పర్యటన వివరాలు.. అంబర్‌పేట్ అసెంబ్లీ కాచిగూడ డివిజన్‌లో పర్యటన.. రాఘవేంద్ర స్వామి టెంపుల్ లింగంపల్లి, బాలప్పవాడ, కురుమ బస్తీ, వీరన్న గుట్టలో కొనసాగనున్న కిషన్‌రెడ్డి టూర్
* తిరుమల: 21 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 81,224 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 24,093 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.35 కోట్లు
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!