నేడు విజయనగరం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. గుర్లలో డయేరియా బాధితులకు అయన పరామర్శిస్తారు. ఉదయం 11 గంటలకు నెల్లిమర్ల రైల్వే స్టేషన్ సమీపంలోని ఎస్ఎస్ఆర్ పేట మంచినీటి పథకంను పరిశీలిస్తారు.
నేటి నుండి 27 వ తేదీ వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఎలాంటి పొరపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా అధికారులు ఏర్పాట్లు చేశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హజరుకానున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 46 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో పరీక్షలు జరగనున్నాయి. 2011 సంవత్సరం తర్వాత మళ్ళీ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయి.
పోలీసు అమరవీరుల స్మారకదినోత్సవం పురస్కరించుకొని గోషామహల్ పోలీస్ స్టేడియంలో పోలీస్ ఫ్లాగ్ డే పరేడ్ నిర్వహించనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. ఉదయం 9:30 గంటలకు కార్యక్రమం మొదలవుతుంది.
నేడు సాయంత్రం రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మెళ్లచెర్వులో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.
నేడు సంస్థాగత ఎన్నికలపై ఢిల్లీలో బీజేపీ వర్క్ షాప్ నిర్వహించనుంది. బీజేపీ కేంద్ర ఎన్నికల అధికారిగా డాక్టర్ కే లక్ష్మణ్ వ్యవహరిస్తున్నారు. బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర ఎన్నికల అధికారులు, రాష్ట్రాల ఎన్నికల అధికారులు, అసిస్టెంట్ ఎన్నికల అధికారులు ఈ వర్క్ షాప్లో పాల్గొంటారు.
నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ జరగనుంది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలపై ఆఫిడవిట్లు సమర్పించిన అధికారులను విచారించేందుకు బహిరంగ విచారణ జరగనుంది. గత విచారణలో పూర్తి కాని మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ఎంక్వైరీ
విచారణను అర్ధాంతరంగా ముగించి. మళ్లీ విచారణను కొనసాగిస్తామన్న జస్టిస్ ఘోష్. ఈ దఫా విచారణలో ఐఏఎస్‌లు, విశ్రాంత ఐఏఎస్‌లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులను విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈనెల చివరితో కాళేశ్వరం కమిషన్ పదవీ కాలం ముగియనుంది.
నేడు సుప్రీం కోర్టులో తెలంగాణ గ్రూప్ 1 కేసు విచారణ జరగనుంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం కేసు విచారణ జరపనుంది.