నేడు ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పలువురు కేంద్రమంత్రులతో సీఎం భేటీ కానున్నారు.
ఇవాళ 14వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. క్వశ్చన్ అవర్‌తో సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై నేడు సీఐడీ కోర్టులో విచారణ జరగనుంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ ఇవ్వాలని వంశీ పిటిషన్ వేశారు.
గన్నవరంలో నేడు మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. బాపులపాడు మండలంలో ఉన్న మల్లవల్లి ఇండస్ట్రియల్ క్యారిడార్‌లో అశోక్ లేల్యాండ్ కంపెనీని మంత్రి ప్రారంభించనున్నారు.
నేడు మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పూర్వపు పీఠాధిపతులు శ్రీ సుయతీద్రతీర్దుల మధ్యారాధన ఉంటుంది. స్వామి వారి బృందావనానికి అభిషేకం, తులసి అర్చన, కనకాభిషేకం, పాలాభిషేకం, మహా పంచామృతాభిషేకం, మహా మంగళహారతి వంటి విషేశ పూజలు జరగనున్నాయి.
నేడు వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటనపై న్యాయ కమీషన్ ఎదుట తిరుపతి ఎస్పీగా పనిచేసిన సుబ్బారాయుడు, జేఈవోగా పనిచేసిన గౌతమీ సహా ఇతర అధికారులు విచారణకు హాజరుకానున్నారు.
ఈరోజు ఉదయం 9.30 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. తెలంగాణ బడ్జెట్ కి కేబినెట్ ఆమోదం తెలపనుంది.
శివ కళ్యాణ మహోత్సవంలో భాగంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి రథోత్సవం నేడు జరగనుంది. నేటి సాయంత్రం పట్టణ పురవీధుల గుండా స్వామి అమ్మవారు విహరించనున్నారు.
నేడు జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవ కార్యక్రమం ఉంది. రథోత్సవంకు భారీ సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు.