నేటి నుంచి 27వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు లక్కిడిప్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవలకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
నేడు మైదుకూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఉదయం 10:30కు ఉండవల్లి నివాసం నుండి 11:05 గంటలకు విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు కెఎస్సి కళ్యాణ మండపం చేరుకొని ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు.
నేడు గుంటూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు పెదకాకాని మండలం నంబూరులో స్వచ్ఛ ఏపీ-స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పవన్ పాల్గొననున్నారు.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేడు రాయచోటలో పర్యటించనున్నారు.
నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఏర్పాట్లు చేశారు. ఘాట్ వద్ద ఉన్న ఎన్టీఆర్ సమాధికి నిండుగా పూలతో అలంకరించారు.
నేడు శ్రీశైలంలో స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం జరగనుంది. మన ఊరు-మన గుడి-మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
నేడు ఖమ్మం జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు జరగనున్నాయి.
ఈరోజు ఖమ్మం జిల్లాల్లో ఎంపీ రేణుకా చౌదరి పర్యటించనున్నారు.
నేడు మెదక్, సిద్దిపేట జిల్లాల్లో మంత్రి కొండా సురేఖ పర్యటించనున్నారు. దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు.
ఈరోజు తెలంగాణ గ్రూప్ 2 ప్రిలిమినరీ కీ విడుదల కానుంది.
ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే భారత జట్టును నేడు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది.