NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాలలో పర్యటించనున్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులను సీఎం పరిశీలించనున్నారు.

సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి చేసేందుకు ప్రయత్నించిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కు ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.

నేడు కడపలో ఎంపీ సీఎం రమేష్ పర్యటించనున్నారు. అనకాపల్లి ఎంపీగా గెలిచిన తర్వాత మొదటిసారిగా కడప జిల్లాకు సీఎం రమేష్ వస్తున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.

కేంద్రమంత్రి కుమారస్వామి నెడ్ విశాఖ ఉక్కు పరిశ్రమను సందర్శించనున్నారు. స్టీల్ ప్లాంటుపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ప్లాంట్ పనితీరు, ఆర్ధిక పరిస్థితిపై సమీక్ష జరపనున్నారు.

నేడు గాంధీభవన్‌కు కురియన్ కమిటీ రానుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులతో కమిటీ భేటీ కానుంది. ఓటమికి గల కారణాలపై కమిటీ సమీక్ష జరపనుంది.

నేడు ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్ లో రైతుభరోసాపై వర్క్ షాప్ నిర్వహించనున్నారు. భట్టితో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క హాజరుకానున్నారు. రైతు భరోసాపై రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలు తీసుకోనున్నారు. లంచ్ తరువాత 3.30 గంటలకు హైదారాబాద్ కు తిరుగు ప్రయాణంఅవుతారు.

నేడు మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో 317 జీవోపై భేటీ జరగనుంది.