ఢిల్లీ: నేడు ఆరో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న పోలింగ్.. 58 లోక్‌సభ స్థానాలకు 889 మంది అభ్యర్థుల పోటీ.. ఢిల్లీ 7, హర్యానా 10, యూపీ 14, పశ్చిమబెంగాల్ 8 లోక్‌సభ స్థానాలకు పోలింగ్.. బీహార్‌లో 8, ఒడిశా 6, జార్ఖండ్ 4, జమ్మూకశ్మీర్‌లో ఒక స్థానానికి పోలింగ్.. ఢిల్లీలో ఓటు వేయనున్న సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక.
బంగాళాఖాతంలో వాయుగుండం.. నేడు తీవ్ర తుపానుగా బలపడే అవకాశం.. ఏపీపై ప్రభావం ఉండదన్న ఐఎండీ.. పశ్చిమబెంగాల్ వద్ద తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడి.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల వరకు వేచి ఉన్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం..
తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,430.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,390.. తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండి ధర రూ.96,400.