Site icon NTV Telugu

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

హైదరాబాద్‌: నేడు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సీఎం రేవంత్ సమావేశం.. సాయంత్రం 4 గంటలకు ఎంసీహెచ్‌ఆర్‌డీలో సమావేశం కానున్న ముఖ్యమంత్రి.

నేడు ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన.. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్న భట్టి విక్రమార్క.

ప్రకాశం: నేడు మేదరమెట్లలో వైసీపీ సిద్ధం 4వ సభ.. ఇవాళ్టితో ముగియనున్న వైసీపీ సిద్ధం సభలు.

నేడు ఏజెన్సీ ప్రాంతం బంద్‌కు పిలుపునిచ్చిన గిరిజన సంఘాలు.. జీవో నెంబర్ 3 పునరుద్దరణ, స్పెషల్ డీఎస్సీ, ఉద్యోగాలలో వంద శాతం స్థానిక గిరిజనులకే కేటాయించాలని డిమాండ్.. మన్యం బంద్‌కు మద్దతు ప్రకటించిన ఆదివాసీ సంఘాలు, రాజకీయ పార్టీలు.. బంద్ ఎఫెక్ట్‌తో సాయంత్రం వరకు మూతపడనున్న ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయలోని బొర్రా గృహాలు, పద్మాపురం గార్డెన్స్, గిరిజన మ్యూజియం.

అనంతపురం : జిల్లా కేంద్రంలో రూ.7 కోట్లతో నిర్మించిన కల్లూరి సుబ్బారావు మ్యూజియంను ప్రారంభించనున్న పర్యాటక శాఖ మంత్రి రోజా.

నంద్యాల: నేడు శ్రీశైలంలో 10వ రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఉదయం బ్రహ్మోత్సవాల పూర్ణాహుతి, త్రిశూలస్నానం, వసంతోత్సవం.. సాయంత్రం సదస్యం, నాగవల్లి బ్రహ్మోత్సవాలకు దేవతలను ఆహ్వానిస్తూ కట్టిన ధ్వజపటాన్ని ధ్వజావరోహణ

అనంతపురం : తాడిపత్రిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలల్లో భాగంగా నేడు బుగ్గరామలింగేశ్వరుడి కళ్యాణం,రథోత్సవం.

తిరుపతి: శ్రీకాళహస్తిలో నేడు స్వామి, అమ్మవార్లు కల్యాణోత్సవం.

నంద్యాల: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు మహానంది క్షేత్రంలో మహారథోత్సవం

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,750.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,270.. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.79,100.

Exit mobile version