Site icon NTV Telugu

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

*నేడు హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు.. వేడుకల్లో పాల్గొననున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా

*నేడు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. రేపు ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న వార్షిక బ్రహ్మోత్సవాలు.. రేపు రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహన సేవ.. రేపు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్

*ఉమ్మడి మెదక్ జిల్లాలో నేడు జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు.. వేడుకల్లో పాల్గొననున్న మంత్రి హరీశ్ రావు.. మెదక్ జిల్లాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. సంగారెడ్డి జిల్లాలో సమైక్యత దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న హోంమంత్రి మహమూద్ అలీ

*ఇవాళ సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ పార్టీ విజయభేరి బహిరంగ సభ.. హాజరుకానున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే

*ఎనిమిదో రోజుకు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్

*ఢిల్లీ: నేడు అన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్లతో కేంద్రం సమావేశం.. రేపటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

*ఇవాళ విజయవాడలో ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు.. మోడీ జన్మదిన వేడుకలలో పాల్గొననున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, కేంద్ర మంత్రి భగవంత్ కుబా

*సాంప్రదాయ కార్మికుల కోసం రూ. 13,000 కోట్లతో ‘పీఎం విశ్వకర్మ’ పథకాన్ని నేడు ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

*ఢిల్లీలోని ద్వారకలో ‘యశోభూమి’ పేరుతో ప్రపంచ స్థాయి కన్వెన్షన్‌ సెంటర్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ

*నేడు ఆసియా కప్‌ ఫైనల్‌.. ఫైనల్‌లో భారత్‌తో తలపడనున్న శ్రీలంక.. మ.3 గంటలకు మ్యాచ్ ప్రారంభం.. గాయంతో మ్యాచ్‌కు అక్షర్ పటేల్ దూరం.. అక్షర్‌ స్థానంలో జట్టులోకి వాషింగ్టన్ సుందర్

Exit mobile version