Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

తెలంగాణ ప్రభుత్వ ఏడాది పాలనపై బీజేపీ పోరుబాట. నేటి నుంచి డిసెంబర్‌ 5 వరకు ఆందోళనలు. నేడు ఛార్జ్‌షీట్‌ విడుదల చేయనున్న బీజేపీ. రేపు జిల్లా స్థాయిలో ఛార్జ్‌షీట్‌ విడుదల. డిసెంబర్‌ 2,3న అన్ని నియోజకవర్గాల్లో బైక్‌ ర్యాలీలు.

నేడు దేశ భద్రతా వ్యవహారాలపై భువనేశ్వర్‌లో డీజీపీ-ఐజీపీల సదస్సు.. ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం, తీర ప్రాంత, జాతీయ భద్రతపై ప్రసంగించనున్న ప్రధాని మోడీ

నేడు విజయవాడలో బీజేపీ రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌. హాజరుకానున్న పురంధేశ్వరి, కె.లక్ష్మణ్‌, శివప్రకాష్.

ఫెంగల్‌ తుఫాన్‌తో తమిళనాడులో భారీ వర్షాలు. చెన్నై సహా ఏడు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌. మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌ తుఫాన్‌. మహాబలిపురం-కారైకల్‌ మధ్య తీరం దాటే అవకాశం. తీరం దాటే సమయంలో 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు. చెన్నై సహా పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు.

నేడు మహబూబ్‌నగర్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన. రైతు పండుగ కార్యక్రమంలో పాల్గొననున్న రేవంత్‌. రూ.2లక్షల రుణమాఫీ, రైతు భరోసాపై కీలక ప్రకటనకు సిద్దమవుతున్న తెలంగాణ ప్రభుత్వం.

హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,510 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,450 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.92,000 లుగా ఉంది.

అండర్‌ 19 ఆసియాకప్‌: నేడు భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌. ఉదయం 10.30 గంటలకు దుబాయ్‌ వేదికగా మ్యాచ్‌.

నేడు అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. నెమకల్లులో పెన్షన్లు పంపిణీ చేయనున్న చంద్రబాబు. గ్రామసభలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.

తెలంగాణలో క్రమంగా తగ్గుతున్న ఉష్ణోగ్రతలు. ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 8.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు. మెదక్‌లో 10.8 డిగ్రీలు, పటాన్‌చెరులో 11 డిగ్రీలు. నిజామాబాద్‌లో 13.5, హనుమకొండలో 15 డిగ్రీల ఉష్ణోగ్రత.

ఈరోజు సాయంత్రం 4 గంటలకు ICC సమావేశం. ఛాంపియన్స్‌ ట్రోఫీపై చర్చించనున్న ఐసీసీ.

పల్నాడు : నేటి నుండి కారంపూడిలోని వీరుల దేవాలయంలో పల్నాటి వీర ఆరాధన ఉత్సవాలు… పల్నాటి యుద్ధం లో అసువులు బాసిన, 66 మంది వీరనాయకులను స్మరిస్తూ ప్రతి ఏటా కార్తీక అమావాస్య నుండి ఐదు రోజులు పాటు జరగనున్న వీరుల ఆరాధన ఉత్సవాలు. నేటి ఐదురోజుల పాటు జరగనున్న పల్నాటి వీరుల ఆరాధన ఉత్సవాలు.

Exit mobile version