*చంద్రబాబును తమ కస్టడీకి కోరుతూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం ఏసీబీ కోర్టులో నేడు విచారణ
*స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో తనను తప్పించాలంటూ చంద్రబాబు స్క్వాష్ పిటిషన్.. నేడు హైకోర్టులో విచారణ
*నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటన.. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్‌లో చేప పిల్లలను విడుదల చేయనున్న మంత్రి.. మత్స్యకారులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి
*నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన.. గుంతపల్లిలో నూతనంగా నిర్మించిన మోనిన్ సిరప్ పరిశ్రమను ప్రారంభించనున్న మంత్రి
*నేటి నుండి కాజీపేట దర్గా ఉడుకు ఉత్సవాలు.. మూడు రోజుల పాటు సాగనున్న కాజీపేట దర్గా ఉత్సవాలు
*నేడు విధుల బహిష్కరణకు బెజవాడ బార్ అసోసియేషన్ పిలుపు.. నందిగామలో న్యాయవాదిపై పోలీసుల దాడికి నిరసనగా విధులు బహిష్కరణకు పిలుపు ఇచ్చిన నందిగామ బార్ అసోసియేషన్
*తూర్పుగోదావరి: నేటి నుంచి నుంచి ‘బాబుతో నేను’ పేరుతో టీడీపీ ప్రజా చైతన్య కార్యక్రమాలు.. రాజమండ్రిలో బస చేసిన లోకేష్ క్యాంపు వద్దకు వచ్చి మద్దతు తెలుపుతున్న పలువురు నేతలు
*రష్యాలో అడుగుపెట్టిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యే అవకాశం.. అప్రమత్తమైన అమెరికా, జపాన్