NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

ఢిల్లీ: నేడు ఇండియా కూటమికి చెందిన భాగస్వామ్యపక్షాల ఫ్లోర్‌ లీడర్ల సమావేశం. ఉదయం 10 గంటలకు పార్లమెంట్‌ భవన్‌లో ఇండి కూటమి భాగస్వామ్యపక్షాల ఫ్లోర్‌ లీడర్ల భేటీ. అదానీపై అమెరికా చేసిన నేరారోపణలపై విచారణ జరిపేందుకు ‘సంయుక్త పార్లమెంటరీ కమిటీ’ని ఏర్పాటు చేయాలంటున్న భాగస్వామ్యపక్షాలు.

డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ. చంద్రబాబు, పవన్‌పై అసభ్యకర పోస్టుల కేసులో ముందస్తు బెయిల్‌ కోరిన ఆర్జీవీ. అత్యవసరంగా విచారణ జరపాలని విజ్ఞప్తి మేరకు ఇవాళ హైకోర్టు విచారణ.

తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,230లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. లుగా ఉంది.70,790 అలాగే కిలో వెండి ధర రూ.97,900 లుగా ఉంది.

అమరావతి:ఏపీ హైకోర్టులో వైసీపీ సోషల్‌ మీడియా నేతలు సజ్జల భార్గవ్‌ రెడ్డి, అర్జున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై నేడు విచారణ. మొత్తం 8 కేసుల్లో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని సజ్జల భార్గవ్‌రెడ్డి పిటిషన్లు. అన్ని పిటిషన్లపై నేడు విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు.

తిరుపతి: నేడు పద్మావతి అమ్మవారి ఆలయంలో లక్ష కుంకుమార్చన. సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. ఎన్నడూ లేని విధంగా తిరుమల తరహాలో ఏర్పాట్లు.

తుఫాన్‌గా మారనున్న తీవ్ర వాయుగుండం. తుఫాన్‌కు’ఫెంగల్‌’గా నామకరణం. మరో రెండు రోజుల్లో తీరం దాటే అవకాశం. చెన్నై-పుదుచ్చేరి మధ్య తీరం దాటనున్న వాయుగుండం. దక్షిణకోస్తా, రాయలసీమకు భారీ వర్షసూచన, ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు. నెల్లూరు జిల్లాలో నిన్నటి నుంచి కుండపోత వర్షం.

తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత. 15 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు. ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 9.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు. ఏజెన్సీల్లో దట్టంగా పొగమంచు.

నేడు ఢిల్లీలో పవన్‌ రెండో రోజు పర్యటన. ఉదయం కేంద్రమంత్రి భూపేందర్‌తో పవన్‌ భేటీ. ప్రధాని మోడీని కలవనున్న పవన్‌ కల్యాణ్‌.

తెలంగాణ బీజేపీ నేతలకు మోడీ అపాయింట్‌మెంట్‌. ఉదయం 11 గంటలకు మోడీన కలవనున్న తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.

తెలంగాణలో కొనసాగుతున్న కాళేశ్వరం కమిషన్‌ విచారణ. జస్టిస్‌ చంద్రఘోష్ నేతృత్వంలో విచారణ. నిన్న విచారణకు హాజరైన 16మంది ఇంజనీర్లు. నేడు మరో 18 మందిని విచారించనున్న కమిషన్‌.