నేడు కేంద్ర కేబినెట్ సమావేశం. ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.
నేడు ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ నెల టిక్కెట్లు విడుదల, మధ్యాహ్నం వసతి గదుల కోటాను విడుదల చేయనున్న టీటీడీ.
నేడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలవనున్న టాలీవుడ్ నిర్మాతలు. తెలుగు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పవన్‌కు వివరించనున్న నిర్మాతలు. సినిమా టికెట్ల రేట్ల విషయంలో పవన్ కల్యాణ్‌తో చర్చించనున్న నిర్మాతలు.
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. ఎంపీల ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న సీఎం రేవంత్.
ఈనెల 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక. నేడు లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా మెహతాబ్ ప్రమాణ స్వీకారం. ఎంపీలతో ప్రమాణం చేయించనున్న లోక్‌సభ ప్రొటెం స్పీకర్.
నేడు, రేపు లోక్‌సభ సభ్యుల ప్రమాణస్వీకారం. ముందుగా ఎంపీగా ప్రమాణస్వీకారం చేయనున్న ప్రధాని మోడీ.
పులివెందులలో మూడో రోజు జగన్ పర్యటన. రెండు రోజుల ప్రజాదర్బార్ నిర్వహించిన మాజీ సీఎం జగన్. నేడు పులివెందులలో మధ్యాహ్నం వరకు ప్రజాదర్బర్. ఇవాళ మధ్యాహ్నం రోడ్డు మార్గాన బెంగళూరుకు జగన్ దంపతులు.
నేటి నుంచి తెలంగాణలో జూనియర్ డాక్టర్ల నిరవధిక సమ్మె. ఓపీ సేవలు,సర్జరీలు, వార్డ్ డ్యూటీలు బహిష్కరించాలని నిర్ణయం. పని వేళలు, జీతాలు, డాక్టర్ల భద్రత అంశాలపై జూడాలు సమ్మెకు పిలుపు.
నేడు మంత్రిగా నారా లోకేష్ బాధ్యతల స్వీకరణ. ఉదయం 9.45 గంటలకు సెక్రటేరియట్‌లో ఐటీ, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న నారా లోకేష్.
నేడు టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియాతో ఆస్ట్రేలియా ఢీ. సెయింట్ లూసియా వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్. ఇప్పటికే సూపర్-8లో రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్.