*హైదరాబాద్: నేడు లాల్‌దర్వాజలోని శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు .. బోనాల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత.. ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు… పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
*నేడు రాజ్‌భవన్‌లో బోనాల పండగ.. పాల్గొననున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
*తెలంగాణలో నేడు వైన్‌షాపులు బంద్.. బోనాల పండగ సందర్భంగా వైన్స్ బంద్.. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6గంటల వరకు బంద్.
*తెలంగాణలో నేడు తొలిదశ ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
*నేడు, రేపు తెలంగాణకు వర్షసూచన.. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
*నేడు ఏపీ బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం.. విజయవాడలో సమావేశం కానున్న నేతలు
*నేడు అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం సమావేశం.. హాజరుకానున్న జాతీయ,రాష్ట్ర స్థాయి నాయకత్వం.. గిరిజన సమస్యలపై భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై చర్చ
*లండన్: నేడు వింబుల్డన్ పురుషుల ఫైనల్లో ఆల్కరజ్-జకోవిచ్ ఢీ